365మందితో డేటింగ్ అంట.. మనోడు రికార్డులు

ఒక వ్య‌క్తి ఎంత మందితో డేటింగ్ చేస్తాడు? మ‌హా అయితే.. ఐదుగురు. లేదంటే.. ప‌ది మందితో డేట్ చేయొచ్చు. కానీ.. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వ్య‌క్తి ఏకంగా 335 మందితో డేటింగ్ చేశాడు. అయినా.. అత‌ని టాస్క్ కంప్లీట్ కాలేదు. ఇంకా 30 మందితో డేట్ చేయాల్సి ఉంద‌ని అంటున్నాడు. అదేంటీ.. స‌రిగ్గా ఇంత మందితోనే డేట్ చేయాల‌ని ఫిక్స్ చేసుకోవ‌డ‌మేంటీ? ఇంత మందితో ఎందుకు రిలేష‌న్ మెయింటెయిన్ చేశాడు? అస‌లు ఇంత‌కీ ఎవ‌ర‌త‌ను? అన్న వివ‌రాలు […]

Written By: Bhaskar, Updated On : August 16, 2021 12:49 pm
Follow us on

ఒక వ్య‌క్తి ఎంత మందితో డేటింగ్ చేస్తాడు? మ‌హా అయితే.. ఐదుగురు. లేదంటే.. ప‌ది మందితో డేట్ చేయొచ్చు. కానీ.. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే వ్య‌క్తి ఏకంగా 335 మందితో డేటింగ్ చేశాడు. అయినా.. అత‌ని టాస్క్ కంప్లీట్ కాలేదు. ఇంకా 30 మందితో డేట్ చేయాల్సి ఉంద‌ని అంటున్నాడు. అదేంటీ.. స‌రిగ్గా ఇంత మందితోనే డేట్ చేయాల‌ని ఫిక్స్ చేసుకోవ‌డ‌మేంటీ? ఇంత మందితో ఎందుకు రిలేష‌న్ మెయింటెయిన్ చేశాడు? అస‌లు ఇంత‌కీ ఎవ‌ర‌త‌ను? అన్న వివ‌రాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.

అత‌ని పేరు సుంద‌ర్ రాము. ఇత‌ను త‌మిళ న‌టుడు. అంతేకాదు చ‌క్క‌టి ఫొటో గ్రాఫ‌ర్‌. ఇంకా ఉంది.. ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ కూడా. ఈయ‌న ఒక‌రిద్ద‌రితో కాదు.. ఏకంగా 365 మందితో డేట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 335 మందితో డేటింగ్ చేశాడు. అయితే.. సుంద‌ర్ రాము చేస్తున్న‌ డేటింగ్.. కేవ‌లం వ‌య‌సులో ఉన్న అంద‌మైన అమ్మాయిల‌తో మాత్ర‌మే చేసేది కాదు. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌ల‌తో చేస్తాడు. అయితే.. డేట్ అన‌గానే అదేదో జ‌రిగిపోతుంది అనే డేట్ కాదు ఇది. అంత‌కు మించిన‌ది.

తొలుత స్టేజ్ ఆర్టిస్టుగా చేసిన రాము.. ఆ త‌ర్వాత త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల్లోనూ న‌టించారు. అంద‌రిలాగానే సాధార‌ణ జీవితం గ‌డిపాడు. అయితే.. 2012లో ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య ఘ‌ట‌న త‌ర్వాత అత‌ని ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింది. ఆ ఘ‌ట‌న త‌న‌ను బాగా క‌ల‌చి వేసింద‌ని, చాలా రోజులు ఆవేద‌న‌లో ఉండిపోయాన‌ని అంటారు సుంద‌ర్ రాము. తాను విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు.. మీ దేశంలో ఎందుకు మ‌హిళ‌ల‌ను అంత దారుణంగా హింసిస్తారు? అని ప్ర‌శ్నించేవారని, ఆ ప్ర‌శ్న‌లు త‌న‌ను మ‌రింత‌గా బాధించాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలోనే.. మ‌హిళ‌ల‌కు వారి హ‌క్కుల గురించి తెలియ‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతారు సుంద‌ర్ రాము. ఇందుకోసం తాను ఎంచుకున్న మార్గ‌మే 365 డేటింగ్ అంటారు. తాను మ‌హిళ‌ల‌ను ఎంతో గౌర‌వించే కుటుంబంలో పెరిగాన‌ని, అబ్బాయిలు, అమ్మాయిల‌ను వేరుగా చూడ‌లేని పాఠ‌శాల‌లో చ‌దువుకున్నాని చెప్పారు. అయితే.. బ‌య‌టి ప్ర‌పంచంలోకి వ‌చ్చిన త‌ర్వాత లింగ వివ‌క్ష దారుణంగా ఉంద‌ని గ‌మ‌నించాన‌ని అంటారు. ఈ క్ర‌మంలోనే జ‌రిగిన నిర్భ‌య ఘ‌ట‌న మ‌రింతగా బాధించింద‌ని చెప్పారు.

అందుకే.. మ‌హిళ‌తో గ‌డుపుతూ.. వారి ఆలోచ‌నల‌ను పంచుకునేందుకు 2014లో డిసెంబ‌ర్ లో ఈ డేట్ కు శ్రీకారం చుట్టిన‌ట్టు చెప్పారు రాము. మ‌న దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని మ‌హిళ‌ల‌తోనూ డేట్ కు వెళ్లిన‌ట్టు చెప్పారు. వీరిలో పారిశుధ్య కార్మికులు, పండ్లు అమ్ముకునే వారు, సినీ న‌టులు, టీచ‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ఉన్న‌ట్టు చెప్పారు రాము. అయితే.. డేట్ అన‌గానే ఏదేదో ఊహించుకోవ‌ద్ద‌ని, మ‌హిళ‌ల‌ను అర్థం చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మే ఇది అని చెప్పారు. ఇందులో త‌న నాన‌మ్మ‌తో వెళ్లిన డేట్ ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పాడు.