
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్లుగా సూపర్ హిట్స్ తో దూసుకెళుతున్నాడు. భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరునికెవ్వరుతో హట్రిక్ విజయాలను మహేష్ బాబు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపింది.
‘సరిలేరునికెవ్వరు’ తర్వాత మహేష్ బాబు పర్శురాం దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ మూవీ చేస్తున్నారు. లాక్డౌన్.. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ కొద్దిరోజులు ఆలస్యమైంది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగంగా అమెరికాలో పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం దర్శకుడు పర్శురాం అమెరికా వెళ్లి షూటింగ్ స్పాట్స్ చూసి వచ్చారు.
తీరా చిత్రయూనిట్ అక్కడికి వెళ్లే సమయంలో వీసాల సమస్య తలెత్తింది. కాగా ఈ మూవీ షూటింగ్ కోసం మహేష్ బాబు ఇటీవలే ఫ్యామిలీ కలిసి వెళ్లాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడని సమాచారం. అయితే తాజాగా మహేష్ బాబు మరో దర్శకుడిని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ను మహేష్ బాబు లాక్ చేసినట్లు తెలుస్తోంది. అందరి హీరోల్లానే మహేష్ బాబు సైతం సైట్స్ పై ఓ మూవీ ఉండగానే మరో దర్శకుడిని లైన్లో పెడుతున్నారు. మహేష్-సుకుమార్ కాంబోలో గతంలో ‘నేనొక్కడినే’ మూవీ వచ్చింది. కలెక్షన్లలో ఈ మూవీ నిరాశపరిచినా క్రిటిక్స్ ను మాత్రం మెప్పించింది.
దీంతో ఈ లెక్కల మాస్టర్ తో మరోసారి పని చేసేందుకు మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సైతం ‘సర్కారువారిపాట’ తర్వాత రాజమౌళి లేదా త్రివిక్రమ్ తో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత మహేష్-సుక్కు కాంబోలో మూవీ రానుందని సమాచారం.