
ప్రస్తుతం తెలుగులో హీరోలందరూ ఒక పక్క సినిమాలు చేస్తూనే నిర్మాతలుగా మారుతున్నారు ఇప్పటికే రామ్ చరణ్ , నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీశారు. త్వరలో ఎన్. టి. ఆర్ కూడా ఎన్ హెచ్ కె అనే బ్యానర్ పెట్టాలనుకొంటున్నాడని వార్తలొచ్చాయి. ఇపుడు తాజాగా మరో హీరో పూర్తి స్థాయి నిర్మాతగా మారబోతున్నాడు. .
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం హీరో గా తీరిక లేకుండా బిజీగా వున్నాడు ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు .కాగా ఇంతవరకు తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన మహేశ్ బాబు త్వరలో పూర్తి స్థాయి నిర్మాణంలోకి దిగాలనుకొంటున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా నిర్మిస్తున్నాడు కూడా …అలా ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ హీరోగా మరో చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ చిత్రం కూడా పూర్తి అయిన వెంటనే కార్తీ (తమిళ్) హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను నిర్మించి ద్విభాషా చిత్రం గా విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాడని తెలుస్తోంది .