https://oktelugu.com/

‘బాలయ్య’ గ్యాప్ లేకుండా ఒప్పుకుంటున్నాడు !

కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం మొత్తం స్తంభించిపోయి.. ముఖ్యంగా సీనియర్ హీరోలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. నాగార్జున ఒక్కడే రెండు రోజులు షూట్ చేసి.. కరోనా టెన్షన్ కి తలొగ్గి షూటింగ్ ను మధ్యలోనే ఆపేశాడు. అయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటూ ముందుకుపోతున్నాడు. తాజాగా బాలయ్య మరో సీనియర్ దర్శకుడితో సినిమాని ఫైనల్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎప్పుడో ఫేడ్ అవుట్ […]

Written By: , Updated On : October 3, 2020 / 04:28 PM IST
Follow us on


కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం మొత్తం స్తంభించిపోయి.. ముఖ్యంగా సీనియర్ హీరోలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. నాగార్జున ఒక్కడే రెండు రోజులు షూట్ చేసి.. కరోనా టెన్షన్ కి తలొగ్గి షూటింగ్ ను మధ్యలోనే ఆపేశాడు. అయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటూ ముందుకుపోతున్నాడు. తాజాగా బాలయ్య మరో సీనియర్ దర్శకుడితో సినిమాని ఫైనల్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన బి గోపాల్. ‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషనే కాదనలేం.. బాలయ్య మొత్తం కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలను డైరెక్ట్ చేసింది బి గోపాలే.. ఇదీ కాదానలేం.

Also Read: ‘కృష్ణ’ కలయికలో సక్సెస్ కొడతారా ?

కానీ డైరెక్టర్ గా పూర్తిగా ఫేడ్ అవుట్ అయిన గోపాల్ కి ఏ హీరో ఛాన్స్ ఇవ్వడు, బాలయ్య తప్ప. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రాస్తున్నారని సమాచారం. సాయి మాధవ్ డైలాగ్స్ బాగా రాయగలడు గానీ, అతను కథను ఇంతవరకూ రాయలేదు. పైగా కథ విషయంలో సాయి మాధవ్ బాగా వీక్ అనే నేమ్ కూడా ఇండస్ట్రీలో ఉంది. మరి అలాంటి సాయి మాధవ్ కథతో గోపాల్ గారు ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read: బిగ్ బాస్ కు అవినాష్ ఎందుకు వెళ్లాడో చెప్పిన హైపర్ ఆది

ఇంతకీ ఆ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో బాలయ్య ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని.. సినిమా కాస్త ఎమోషనల్ టోన్ లో నడుస్తోందని.. గతంలో బాలకృష్ణ ఎప్పుడూ ఇలాంటి కథలో నటించలేదని తెలుస్తోంది. అయితే సినిమా మాత్రం బాలయ్య శైలిలోనే సాగుతూ కాస్త కొత్తగా ఉంటుందట. గోపాల్ కరోనా తగ్గిన వెంటనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని.. కాకపోతే బాలయ్య మాత్రం నవంబర్ నుండి షూటింగ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ దసరా నాడు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మొత్తానికి బాలయ్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.