https://oktelugu.com/

అల్లు అర్జున్ కారవాన్ ను ఢీకొట్టిన లారీ

అల్లు అర్జున్ కోట్లు పోసి సినిమా షూటింగ్ లకు వెళ్లేందుకు అత్యాధునిక వసతులు గల కార్ వాన్ ను కొన్న సంగతి తెలిసిందే.. అల్లు అర్జున్ ఈ కారవాన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు. ఈ కారవాన్ ఖరీదు రూ. 7 కోట్లు అని టాలీవుడ్ లో టాక్. ఎంతో ఇష్టపడి దీనిని కొనుగోలు చేసి సినిమా షూటింగ్ లకు దీనిలోనే వెళుతుంటాడు. ఆ కార్ వాన్ లోనే ప్రయాణిస్తూ పుష్ప సినిమా షూటింగ్ కు హాజరు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 6, 2021 / 06:15 PM IST
    Follow us on

    అల్లు అర్జున్ కోట్లు పోసి సినిమా షూటింగ్ లకు వెళ్లేందుకు అత్యాధునిక వసతులు గల కార్ వాన్ ను కొన్న సంగతి తెలిసిందే.. అల్లు అర్జున్ ఈ కారవాన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు. ఈ కారవాన్ ఖరీదు రూ. 7 కోట్లు అని టాలీవుడ్ లో టాక్. ఎంతో ఇష్టపడి దీనిని కొనుగోలు చేసి సినిమా షూటింగ్ లకు దీనిలోనే వెళుతుంటాడు. ఆ కార్ వాన్ లోనే ప్రయాణిస్తూ పుష్ప సినిమా షూటింగ్ కు హాజరు అవుతున్నారు. పుష్ప సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. దీనికి తగినట్టు షూటింగ్ జరుపుకుంటోంది.

    తాజాగా అల్లు అర్జున్ కార్ వాన్ వాహనానికి ప్రమాదం పెద్ద ప్రమాదం జరిగింది. పుష్ప సినిమా ఘాటింగ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఆయన కారవాన్ ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టిది. ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో ఆ వాహనం ఆయనదిగా పోలీసులు గుర్తించారు.

    అయితే ఆ కార్ వాన్ లో అల్లు అర్జున్ లేడని సమాచారం. కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడతో అక్కడున్న వారు హీరోకు గాయలు అయి ఉంటాయనుకుని వార్తలు వెలువడ్డాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ కంగారు పడ్డారు. అయితే ప్రమాదంలో అల్లు అర్జున్ గాయపడలేదని సమాచారం. ఆ ప్రమాదానికి కారణం కారవాన్ డ్రైవర్ తప్పుచేశాడా లేక వెనుక ఉన్న లారీ డ్రైవర్ తప్పు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప సినిమా ఘాటింగ్ ఏపీలోని రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు. జనవరిలో రెండో షెడ్యూల్ కూడా పూర్తయిపోయిందంటూ ఈ రోజే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఘాటింగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తన కారులో వచ్చేసి ఉంటాడని, వెనుక వస్తున్న కారవాన్ ను కంటెయినర్ ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. కేవలం మేకప్ టీమ్ మాత్రమే ఉన్నారని, అల్లు అర్జున్ లేడని నిర్మాణ సంస్థ ప్రకటించింది