https://oktelugu.com/

శ్రీరాముడు మా పార్టీ వాడే: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులరిజం భావాలన్నీ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ హిందుత్వ భావజాలం పెరిగిపోయింది. అదే బీజేపీని రెండోసారి అధికారంలోకి తెచ్చింది. దానికి అనుగుణంగానే ఉత్తరప్రదేశ్ లో రామజన్మభూమిని సాధించి శ్రీరామ ఆలయాన్ని దేదీప్యమానంగా బీజేపీ నిర్మిస్తోంది. శ్రీరాముడు కొలువైన అయోధ్యను సాధించిన బీజేపీకి ఇప్పుడు యూపీలోనే కాదు దేశమంత పాజిటివ్ వేవ్ లభించింది. Also Read: 2జి, 3జి, 4జి.. ఇప్పుడు 5జీ.. యూపీలోని ప్రతిపక్ష సమాజ్ వాదీ ఇన్నాళ్లు యాదవ, బీసీ, సెక్యులర్ భావాలతో రాజకీయం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2020 / 09:14 PM IST
    Follow us on

    దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులరిజం భావాలన్నీ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ హిందుత్వ భావజాలం పెరిగిపోయింది. అదే బీజేపీని రెండోసారి అధికారంలోకి తెచ్చింది. దానికి అనుగుణంగానే ఉత్తరప్రదేశ్ లో రామజన్మభూమిని సాధించి శ్రీరామ ఆలయాన్ని దేదీప్యమానంగా బీజేపీ నిర్మిస్తోంది. శ్రీరాముడు కొలువైన అయోధ్యను సాధించిన బీజేపీకి ఇప్పుడు యూపీలోనే కాదు దేశమంత పాజిటివ్ వేవ్ లభించింది.

    Also Read: 2జి, 3జి, 4జి.. ఇప్పుడు 5జీ..

    యూపీలోని ప్రతిపక్ష సమాజ్ వాదీ ఇన్నాళ్లు యాదవ, బీసీ, సెక్యులర్ భావాలతో రాజకీయం చేసేది. తాజాగా ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రూటు మార్చేశాడు. యూపీలోని అజమ్‌గఢ్‌ నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో అఖిలేశ్ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాసేపు అయోధ్యలో ఆగారు. ఈ సందర్భంగా శ్రీరాముడిని సమాజ్ వాదీ పార్టీలోకి మార్చేసి హాట్ కామెంట్స్ చేశారు.

    అఖిలేష్ మాట్లాడుతూ.. సమాజ్ వాదీ నేతలమంతా శ్రీరాముడు, కృష్ణుడి భక్తులమని అన్నారు. కుటుంబాలతో వచ్చి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిని సందర్శిస్తామని తెలిపారు.

    Also Read: న్యాయవాదులకు ఇక చుక్కలే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు

    శ్రీ రామచంద్రుడు మా పార్టీకి చెందిన వాడని అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమంతా రామ భక్తులమనీ తామంతా త్వరలోనే కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముడ్ని దర్శించుకుంటాం’ అని సంచలన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్