కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ను మించేలా రెండోపార్ట్ ను తిర్చిదిద్దినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. అమ్మకిచ్చిన మాట కోసం హీరో పోరాడిన తీరు.. బంగారు గనుల్లో పోరాడిన సీన్లు.. ప్రియురాలికి తోడుగా నిలిచిన విధానం.. ఇక హీరో యష్ జీపులను గన్ తో పేలుస్తున్న సీన్లు హైలెట్ గా నిలిచాయి. హీరో ఎలివేషన్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో చూపించాడు.
కేజీఎఫ్2లో విలన్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అధీరగా కనిపించనున్నాడు. తొలి పార్ట్ లో అధీర పాత్రను చూపించలేదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోను విలన్ గా చూపించడం విశేసం. ఇక రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
తొలి భాగంలో గరుడను చంపిన హీరో రాకీ.. రెండో భాగంలో కేజీఎఫ్ ను ఎలా దక్కించుకున్నాడు.. అధీర ఎలా తిరిగొచ్చాడు? కేజీఎఫ్ కోసం మాటు వేసిన వారిని ఎలా ఎదుర్కొన్నాడు.? భారత ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడన్నది ఈ సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారు.
టీజర్ తోనే షేక్ చేసిన కేజీఎఫ్2 విడుదల తేదిని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ టీజర్ దేశంలో రికార్డులు సృష్టించింది. యావత్ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో చిత్ర బృందం తాజాగా విడుదల తేదిని ప్రకటించింది. జూలై 16వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. దాదాపు షూటింగ్ అయిపోయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుపుకుంటోంది.