https://oktelugu.com/

కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?

కేసీఆర్ పట్టుబట్టారు. సాధించడానికి సమాయత్తమవుతున్నారు. అయితే గెలుపు అంత ఈజీ కాదు.. కేసీఆర్, టీఆర్ఎస్ పై పీకల్లోతు కోపంగా ఉన్న పట్టభద్రులు. దుబ్బాకలో ఇప్పటికే ఓటమి.. జీహెచ్ఎంసీలో వెనుకబాటుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే 2023లో తట్టాబుట్టా సర్దేసుకోవడమే. అందుకే కేసీఆరే రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ మళ్లీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును ఆశ్రయించాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ లో గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాలపై పెట్టారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 10:24 AM IST
    Follow us on

    కేసీఆర్ పట్టుబట్టారు. సాధించడానికి సమాయత్తమవుతున్నారు. అయితే గెలుపు అంత ఈజీ కాదు.. కేసీఆర్, టీఆర్ఎస్ పై పీకల్లోతు కోపంగా ఉన్న పట్టభద్రులు. దుబ్బాకలో ఇప్పటికే ఓటమి.. జీహెచ్ఎంసీలో వెనుకబాటుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే 2023లో తట్టాబుట్టా సర్దేసుకోవడమే. అందుకే కేసీఆరే రంగంలోకి దిగారు.

    సీఎం కేసీఆర్ మళ్లీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును ఆశ్రయించాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ లో గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాలపై పెట్టారు. తోడుగా భీముడు అని ముద్దుగా పిలిచే మంత్రి గంగుల కమలాకర్, మరో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఇచ్చారు. వీరు ముగ్గురు చెరో జిల్లాను తీసుకొని అక్కడ పట్టభద్రులను ఒప్పించి గెలిపించాల్సి ఉంటుంది.

    ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.

    ఈసారి పట్టభద్రుల్లో తప్పకుండా గెలవాలని.. నిర్లక్ష్యం వమించే మంత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం. అందుకే కీలక బాధ్యతలను కీలక మంత్రులకు అప్పజెప్పారు.

    అయితే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఉద్యోగ ప్రకటనలు వేయని కేసీఆర్ పై నిరుద్యోగులు, ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టభద్రుల్లో గులాబీ పార్టీ గెలవడం అంత ఈజీ కాదంటున్నారు. మరి కేసీఆర్ పాచిక పారుతుందో లేదో చూడాలి.