https://oktelugu.com/

ప్రచారం కన్నా పనులే ముఖ్యం : పబ్లిసిటీని ఇష్టపడని జగన్‌

నిత్యం ప్రజలకు సేవ చేసేందుకే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా నిత్యం ప్రజల్లో ఉండాలనే వారు కూడా కోరుకుంటారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా అంతే హూందాగా ఉండాలి. నిత్యం ప్రజలతో మమేకం అవుతూనే.. మీడియాతో సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అదే చేశారు కూడా. రోజుకోసారైనా అలా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక ప్రెస్‌మీట్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2021 / 10:13 AM IST
    Follow us on


    నిత్యం ప్రజలకు సేవ చేసేందుకే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా నిత్యం ప్రజల్లో ఉండాలనే వారు కూడా కోరుకుంటారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా అంతే హూందాగా ఉండాలి. నిత్యం ప్రజలతో మమేకం అవుతూనే.. మీడియాతో సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అదే చేశారు కూడా. రోజుకోసారైనా అలా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక ప్రెస్‌మీట్‌ పెట్టేవారు. కానీ.. ఇప్పటి సీఎంలు అందరూ తమ దారిలో తాము వెళ్తున్నారు. ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా సైలెంట్‌గా పాలన నడిపిస్తున్నారు. అందులో ఏపీ సీఎం జగన్‌ కూడా ఒకరు.

    Also Read: కేసీఆర్ ను ఢీకొట్టే షర్మిల ప్లాన్ ఇదే!

    నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే మీడియా హడావిడి అంతా ఇంతా కాదు. సమీక్షలని, వీడియో కాన్ఫరెన్స్‌లని, ఆకస్మిక తనిఖీలంటూ ఇలా నిత్యం ప్రజల్లోనే నలుగుతుండేవారు. ఇక మీడియా సమావేశాలు వారానికి కనీసం మూడు రోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకునే వారు. ఇక ప్రభుత్వం నుంచి లీకుల సంగతి చెప్పనవసరం లేదు. పార్టీ నేతలపైనా, అధికారులపైనా వరస లీకులు ఇస్తూ ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకునే వారు.

    ఇప్పుడు ఏపీలో సీఎం జగన్‌ గానీ.. తెలంగాణాలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా హడావిడి చేయలేదు. అయినా.. ఆయన రెండోసారి ప్రజామోదంతో గద్దెనెక్కారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడో తప్ప మీడియా ముందుకు రారు. రాష్ట్ర విషయాలను తప్ప పెద్దగా దేనినీ పట్టించుకోరు. కానీ.. ఐదుసార్లు నవీన్ పట్నాయక్‌ను విజయం వరించింది. ఈఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్లుంది.

    Also Read: తుని రైలు దగ్ధం కేసు: ముద్రగడకు కోర్టు షాక్

    చంద్రబాబుకు మితిమీరిన పబ్లిసిటీయే చేటు తెచ్చి పెట్టినట్లుగా అందరూ అంటుంటారు. అమరావతి, పోలవరంల విషయంలోనూ చంద్రబాబు వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నా పెద్దగా దానిపై ఫోకస్ పెట్టడం లేదు. అనుకున్న లక్ష్యం చేరడమేనని ఆయన అధికారులను ఆదేశించడం వరకే పరిమితమయ్యారు. నిత్యం ప్రాజెక్టుల చుట్టూ తిరగడం లేదు. తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు చూపిన దృశ్యాలను జగన్ మారుస్తున్నారంటున్నారు. అందుకే ఎక్కువగా జగన్ పబ్లిసిటీకి ఇష్టపడటం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్