తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. వ్యతిరేకత తగ్గించేందుకేనా?

తెలంగాణలో పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించడానికి సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఈ క్రమంలోనే యువత, నిరుద్యోగులకు ఇటీవల 50వేల ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా పీఆర్సీ, డీఏ, జీతాలు పెంపు లేకుండా ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్.. డేత్ రేట్ పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు..! ఈ క్రమంలోనే  ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కొత్త సంవత్సరం కానుకను ప్రకటించారు. ఉద్యోగుల వేతనాలతోపాటు పదవీ విరమణ […]

Written By: NARESH, Updated On : December 29, 2020 8:04 pm
Follow us on

తెలంగాణలో పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించడానికి సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఈ క్రమంలోనే యువత, నిరుద్యోగులకు ఇటీవల 50వేల ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా పీఆర్సీ, డీఏ, జీతాలు పెంపు లేకుండా ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్.. డేత్ రేట్ పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

ఈ క్రమంలోనే  ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కొత్త సంవత్సరం కానుకను ప్రకటించారు. ఉద్యోగుల వేతనాలతోపాటు పదవీ విరమణ వయసు పెంచేందుకు   నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, చార్ట్ డ్, డెయిలీ వేజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైం కాంటిజెంట్ ఉద్యోగులతోపాటు హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యావలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు పింఛన్ దారులు ఇలా అందరికీ ప్రయోజనం కలిగించేలా వేతనాల పెంపు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని.. అందరికీ వేతనాలు పెంపు వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు తక్కువ వేతనాలు ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతోపాటు పింఛనుదారులకు ఇచ్చే పింఛన్ ను సైతం పెంచేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.

Also Read: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..!

ఇక ఇదే కాదు.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.

మొత్తంగా తనపై వ్యతిరేకంగా ఉండి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించిన యువత, నిరుద్యోగులు, ఉద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డట్టు తెలుస్తోంది. వరుస ఓటములు ముందు ముందు కూడా నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కేసీఆర్ తేరుకొని ఈ వరాల వాన కురిపిస్తున్నట్టు అర్థమవుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్