https://oktelugu.com/

గ్రేటర్‌‌లో ‘సోషల్‌’ వార్‌‌

మొన్నటి వరకు ఎన్నికలంటే న్యూస్‌ చానల్స్‌ను.. లేదంటే పేపర్ల ద్వారా పబ్లిసిటీ చేయించుకునేవి పార్టీలు. కానీ.. ఇప్పుడు అంతా హైటెక్‌ ప్రపంచం కావడం.. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తుండడంతో పార్టీలన్నీ సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలు సైతం పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి. దీంతో ప్రతీ పార్టీ సోషల్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటి మొన్న దుబ్బాక ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియాను వాడే బీజేపీ విజయం సాధించిందనేది టాక్‌. సోషల్‌ మీడియాను వాడడంలోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 12:35 pm
    Follow us on

    మొన్నటి వరకు ఎన్నికలంటే న్యూస్‌ చానల్స్‌ను.. లేదంటే పేపర్ల ద్వారా పబ్లిసిటీ చేయించుకునేవి పార్టీలు. కానీ.. ఇప్పుడు అంతా హైటెక్‌ ప్రపంచం కావడం.. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తుండడంతో పార్టీలన్నీ సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలు సైతం పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి. దీంతో ప్రతీ పార్టీ సోషల్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. మొన్నటి మొన్న దుబ్బాక ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియాను వాడే బీజేపీ విజయం సాధించిందనేది టాక్‌. సోషల్‌ మీడియాను వాడడంలోనూ బీజేపీ తర్వాతే ఏ పార్టీ అయినా అని కూడా చెబుతుంటారు.

    Also Read: హీటెక్కిస్తున్న గ్రేటర్‌‌ సమరం.. ఎవరికి మొగ్గు ఉంది?

    అయితే.. ఈ సోషల్‌ మీడియా ద్వారా ఎన్ని వాస్తవాలు తెలుస్తాయో.. అంతకన్నా రెట్టింపు స్థాయిలో ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీల ప్రచారంలోనూ అదే జరుగుతోంది. వివిధ పార్టీల సానుభూతిపరులు ప్రముఖ సర్వే సంస్థల పేరుతో ఫేక్‌ సర్వేల రిపోర్టులను రూపొందిస్తున్నారు. సాధారణ ప్రజలు సులువుగా నమ్మేలా వివిధ పార్టీలకు వచ్చే స్థానాలతో పాటు ఓటింగ్‌ శాతాన్ని అందులో పొందుపరుస్తున్నారు. ఒక సర్వేలో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తే.. మరొక సర్వేలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ స్థానాలు వస్తాయనే లెక్కలు చూపిస్తున్నారు. ఒక పార్టీ ఫేక్‌ సర్వే బయటకు రాగానే.. దానికి కౌంటర్‌గా మరో సర్వేను పోస్ట్‌ చేస్తున్నారు.

    మొన్నటివరకు బీజేపీ సోషల్‌ మీడియాలో దూకుడుగా వ్యవహరించగా.. ఈసారి అధికార పార్టీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుని జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా పోస్టులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఫేక్‌ న్యూస్‌ను కూడా భారీగా వైరల్‌ చేస్తున్నారు. అయితే.. ఇదంతా విదేశాల్లోని పార్టీల అభిమానులే చేస్తున్నారంటూ పోలీసులు వాపోతున్నారు.

    జీహెచ్‌ఎంసీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రూ.10 వేల వరద సాయాన్ని ఆపేయాలని తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ పేరుతో ఒక లేఖ సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. వరద సాయాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు అందులో ఉంది. అది సోషల్‌ మీడియాలో వైరలైంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి లేఖను సృష్టించారంటూ సంజయ్‌ హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫేక్‌ న్యూస్‌ను టీఆర్‌ఎస్‌ సృష్టించిందని, సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీకి చాలా నష్టం చేస్తున్నారు. సంజయ్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యత నుంచి తొలగించండి’ అని రాజాసింగ్‌ పేరుతో ఒక ఫేక్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరలైంది. తన ట్విటర్‌ ఖాతాను మార్ఫింగ్‌ చేసి కొందరు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని, ఈ ట్వీట్‌ను ఎవరూ నమ్మొద్దని రాజాసింగ్‌ వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఝుటా మాటల ముఠా’ అంటూ ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రసంగాలను ఆ వీడియోలో ఎడిటింగ్‌ చేశారు. మంత్రి హరీశ్‌ ఒక ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన ఝుటా నంబర్‌ 1, 2, 3 అనే మాటలను మధ్యలో చొప్పించి వదిలారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు చెప్పేవన్నీ అబద్ధాలని, వాటిని హరీశ్‌రావు అంగీకరిస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది.

    Also Read: ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో టీఆర్‌‌ఎస్‌కు షాక్‌?

    అంతేకాదు.. బీజేపీ తెలంగాణ నాయకుల్లో వర్గపోరు తారస్థాయికి చేరిందనే ఫేక్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది. అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ వర్గాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ ఢిల్లీ చేరిందనే ఫేక్‌న్యూ్‌స్‌ను ఒక వెబ్‌సైట్‌లో ప్రచురితమైనట్లు మార్ఫింగ్‌ చేశారు. ఈ విషయాన్ని నమ్మే విధంగా బీజేపీ జాతీయ నాయకుడు పి.మురళీధర్‌రావు పేరుతో ఫేక్‌ ట్వీట్‌ను రూపొందించారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు విభేదాలను పక్కన పెట్టి పనిచేయండి’ అని అందులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. మెల్లమెల్లగా బలపడుతున్న బీజేపీని అభాసుపాలు చేసేందుకు టీఆర్‌‌ఎస్‌ వేగులు సోషల్‌ మీడియా వేదికగా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్