వకీల్ సాబ్ కి గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో పది రోజులు షూట్ చేస్తే.. ఈ సినిమా పూర్తయిపోతోంది. అందుకే ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటివరకూ పవన్ షూట్ పై ఆసక్తిగా లేడు, కానీ దిల్ రాజు రిక్వెస్ట్ తో షూట్ లో పాల్గొనడానికి పవన్ […]

Written By: admin, Updated On : September 11, 2020 4:08 pm
Follow us on


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో పది రోజులు షూట్ చేస్తే.. ఈ సినిమా పూర్తయిపోతోంది. అందుకే ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటివరకూ పవన్ షూట్ పై ఆసక్తిగా లేడు, కానీ దిల్ రాజు రిక్వెస్ట్ తో షూట్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ నుండి సానుకూల స్పందన వచ్చింది. అందుకే చిత్రబృందం షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసే పనిలో ఉందట. అయితే ఈ సినిమాని కుదిరితే ఓటీటీలో రిలీజ్ చేయాలని కూడా దిల్ రాజు ప్లాన్ లో ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి కూడా థియేటర్ల పరిస్థితి ఇప్పుడు ఉన్నట్లే ఉంటే.. ఇక ఓటీటీలోనే ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

Also Read: సుశాంత్ కేసు: రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు

ఏమైనా పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి, ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిజానికి ఇది కమర్షియల్ సినిమా కాదు, పైగా ఎంటర్ టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉండదు. కానీ, ఈ సినిమా పై మాత్రం పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ అని పవన్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నుండి ఆయన శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు. అయితే పవన్ ఇదివరకు చేసినట్లు డాన్స్ లు అండ్ రొమాన్స్ చేసే పరిస్థితి ఈ సినిమాలో లేదు. అలాగే కాస్త మోతాదుకు మించి యాక్షన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాలో అవకాశం లేదు, ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. ఫ్యాన్స్ ఆశించినట్లు ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు అసలు ఉండవు.

Also Read: బాహుబలిని మించి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం..

ఈ లెక్కన ఈ సినిమా నుండి పవన్ ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఈ సినిమా మీద పవన్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా పై కూడా పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో కామెంట్స్ చేసుకుంటూ ఓ రేంజ్ లో హడావుడి చేశారు కూడా. కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యాక, అసలుకే మోసం వచ్చింది. ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు. దాంతో ఆ సినిమా రిజల్ట్ మరింతగా పడిపోయింది. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా పై కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. పోరాపాటున రేపు అవుట్ ఫుట్ తేడా వస్తే గనుక, వకీల్ సాబ్ ని కూడా మొదటిరోజే పక్కన పెట్టేస్తారు.