
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడిపై పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చే అవకావం ఉంది. మాకు మున్ముందు చాలా సిరీస్ లు ఉన్నాయి. అందులో కఠినమైన టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని దూరం చేసుకోవడం నాకిష్టం లేదు అని అండర్సన్, ఓలీ రాబిన్సన్ పై ఉన్న పని ఒత్తిడి గురించి క్రిస్ సిల్వర్ వుడ్ వెల్లడించారు. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే ఐదో టెస్టులో మాత్రం అండర్సన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.