
వదల బొమ్మాళీ అంటూ నిమ్మగడ్డ వెంట పడుతోంది జగన్ సర్కార్.. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు వ్యతిరేకంగా తాజాగా హైకోర్టు గడపతొక్కింది. ఏపీ సర్కార్ ను ఇరుకునపెట్టాలని ఉన్న యాప్ ను తొలగించి నిమ్మగడ్డ కొత్త యాప్ ను ఆవిష్కరించారు. పంచాయితీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడమే ధ్యేయంగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కొత్త యాప్ తీసుకొచ్చారు. జగన్ సర్కార్ ను అడ్డుకునేందుకు ఈ కొత్త ఎత్తు వేశారు.
Also Read: ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?
నిమ్మగడ్డ తయారు చేయించిన కొత్త యాప్ ఇప్పుడు చిచ్చు పెట్టింది. దీనిపైనే జగన్ సర్కార్ సీరియస్ అవుతోంది. పాత యాప్ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చి ఉపయోగించాలని నిర్ణయించారు. ఎన్నికల ఫిర్యాదులు, పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కాల్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు ఎక్కింది.
నిమ్మగడ్డ తయారు చేయించిన యాప్ ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉందని.. టీడీపీ ఫిర్యాదుల కోసమే దీన్ని తయారు చేసిందని ప్రభుత్వం అనుమానిస్తోంది. హైకోర్టులో తాజాగా యాప్ కు వ్యతిరేకంగా లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోహన్ నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది.
Also Read: ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?
ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లాంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటీషన్ లో ప్రస్తావించింది. యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్