ఏపీ తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఆయన మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాయి. తెలంగాణలో టీఆర్ఎస్.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీ తొలి స్పీకర్ గా పనిచేసే అరుదైన అవకాశం కోడెల శివప్రసాద్ కు దక్కింది. ఐదేళ్లపాటు స్పీకర్ గా కొనసాగారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి జగన్ కు మరో సవాల్
ఈ సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు ఆయన పలు ఆరోపణలు చేశాయి. టీడీపీ అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు గుప్పించి శివప్రసాదరావును టార్గెట్ చేశారు. రాజ్యాంగ పదవీకి ఆయన కలంకం తీసుకొస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా జగన్మోరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నేతలను జగన్ సర్కార్ టార్గెట్ చేస్తూ అనేక కేసులు బానాయించింది. ఈ క్రమంలోనే కొడెల శివప్రసాదరావుపై పలు కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు గురయ్యారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కోడెల చనిపోయి బుధవారం నాటికి ఏడాది పూర్తికానుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కోడెల ప్రథమ వర్ధంతి నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురంలోని కొడెల ఇంటి వద్ద, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కొడెల ప్రథమ వర్ధంతి నిర్వహించేందుకు కోడెల అభిమానులు సన్నహాలు చేసుకుంటున్నారు. దీనిపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్ధంతిని నిర్వహించొద్దని నోటీసులు జారీ చేశారు.
Also Read: స్టాండ్ మార్చింది జగనా? చంద్రబాబా?
పోలీసుల తీరును కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం తప్పుబట్టారు. కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు వర్ధంతి కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ఆసరా వారోత్సవాల పేరిట సభలు, సమావేశాలతో ప్రజలందరికీ ఒక్కచోట చేర్చి ఆడంబరాలు చేస్తుందన్నారు. వారికి కోవిడ్ నిబంధనలు వర్తించవా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారంటూ నిలదీశారు.
పోలీసులు కరోనా నిబంధనల పేరుతో వర్ధంతిని ఆపాలని చూస్తున్నారని.. ఇదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.జగన్ సర్కార్ కేసు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పుడు ఆయన వర్ధంతిని కూడా నిర్వహించుకోకుండా ప్రభుత్వం వ్యహరిస్తుందని మండిపడ్డారు. పోలీసులు కోడెల వర్ధంతిని ఆపాలనుకున్నా.. నిర్వహించి తీరుతామంటూ ఆయన అభిమానులు స్పష్టం చేశారు. దీంతో బుధవారం రోజున పోలీసులకు, కోడెల అభిమానులకు మధ్య ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.