అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?

ఏపీలో రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇప్పటికే విచారణ జరిపి ప్రాథమిక నివేదికల ఆధారంగా దర్యాప్తు విషయంలో ముందడుగులు వేస్తోంది. తాజాగా ఏసీబీ మరింత దూకుడు పెంచింది. Also Read : నేలవిడిచి సాము చేస్తున్న జగన్ కొందరు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు, రాజకీయ ప్రముఖులు, టీడీపీ సన్నిహితులు, […]

Written By: Navya, Updated On : September 16, 2020 9:54 am
Follow us on

ఏపీలో రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇప్పటికే విచారణ జరిపి ప్రాథమిక నివేదికల ఆధారంగా దర్యాప్తు విషయంలో ముందడుగులు వేస్తోంది. తాజాగా ఏసీబీ మరింత దూకుడు పెంచింది.

Also Read : నేలవిడిచి సాము చేస్తున్న జగన్

కొందరు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లు, రాజకీయ ప్రముఖులు, టీడీపీ సన్నిహితులు, పలువురు నేతల బినామీలు అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కొన్ని ప్రముఖ కంపెనీలు సైతం భూములు కొనుగోలు చేశాయని… ఆ కంపెనీలకు టీడీపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రకటన సెప్టెంబర్‌ 3, 2015న జరిగింది.

అయితే 2014లోనే అసైన్డ్ భూముల చట్టం, ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగినట్లు గుర్తించారు. భూములు కొనుగోలు చేసిన వాళ్లలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఏసీబీ దర్యాప్తులో ప్రముఖంగా ముగ్గురు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి.

అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన నివేదికను అందజేయగా సిట్‌ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు కావడం గమానార్హం.

Also Read : పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన