రాజకీయంలో ఏపీ సీఎం జగన్ రాటుదేలుతున్నాడు. మొదట్లో ఎదురైన రాజకీయ ఇబ్బందులు.. ప్రతిపక్షంలో కొనసాగిన అనుభవాలు రోజురోజుకూ పాఠంలా మారాయి. అందుకే.. తన మీద పడ్డ ఒక్కో రాయిని ఒక్కో మెట్టులా పేర్చుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు అధికారం చేపట్టాక ఆయన రాజకీయంలో మరింత పరిణతి సాధించారని చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్థిక బాధలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని ఆ బాధల నుంచి గట్టెక్కించేలా కొత్త కొత్త ఐడియాలు వెతుకుతున్నాడు. రూపాయి పుట్టే మార్గాలను అన్వేషిస్తున్నాడు.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?
ఇందకు తాజా ఉదాహరణే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు. జగన్ తన పాదయాత్ర సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిన్నర పాలన తరువాత జగన్ ఆ హామీకి మరిన్ని కొత్త మెరుగులు దిద్ది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మార్చుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలోనే కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా.. 33కు పెంచారు. ఆయన చాలా చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా రాజకీయ లాభం పొందారు.
అందుకే.. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ తమ్ముళ్లు ఒత్తిడి తెచ్చారు. కానీ బాబు మాత్రం అది పెద్ద భారం అని కొట్టిపారేశారు. ఒక విధంగా ఆలోచిస్తే కొత్త జిల్లాలు, కొత్త కలెక్టర్లు, పాలనాపరమైన సదుపాయాలు వీటికి ఖర్చు భారమే అవుతుంది. కానీ వాటి విషయంలో బాబు పూర్తి శ్రద్ధ పెట్టి ఉంటే అవి మరోలా కూడా ఉపయోగపడేవి. అందుకే.. బాబు చేయలేని చాలా పనులన్నీ ఇప్పుడు జగన్‌కు వరంలా మారుతున్నాయి. జగన్ కొత్త జిల్లాల నినాదాన్ని ఎత్తుకోవడం వెనక ఎత్తుగడలు అనేకం ఉన్నాయి.
Also Read: కాంగ్రెస్ మరో పోస్టుమార్టం.. సోనియా దూరం
కేంద్రం జిల్లాలను యూనిట్‌గా తీసుకొని పెద్ద ఎత్తున నిధులిస్తుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఆ విధంగానే అభివృద్ధి సాధిస్తున్నాయి. ఇక కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్‌లు కూడా వస్తాయి. వాటికి నేరుగా కేంద్రం నిధులు ఇస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాలన కూడా దగ్గరై ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం అవుతాయి. జగన్ 25 జిల్లాలు అని మొదట అన్నారు. అరకును రెండు చేస్తూ 26 అని కూడా చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట మాత్రం 32 జిల్లాలు ఏర్పాటు చేస్తారని. మొత్తానికి జగన్ మాస్టర్ మైండ్‌తో ఆలోచించి ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్న తమ్ముళ్లు మాత్రం తమ అధినేతపై ఫైర్ అవుతున్నారు. తాము చెప్పినప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్