https://oktelugu.com/

బిగ్ బాస్’ చేష్టలకు కన్నీరు పెట్టుకున్న అవినాష్.. అరియానా..!

బిగ్ బాస్-4 ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పటిలాగే ఉత్కంఠగా సాగింది. 9వ వారంలో అమ్మ రాజశేఖర్ వెళ్లిపోతాడనే ముందస్తు లీకైనా చివరి వరకు నాటకీయతను తలపించింది. బిగ్ బాస్ హౌస్ చూస్తున్న ప్రేక్షకులకు అవినాష్ ఎలిమినేట్ అవుతాడా? అన్నట్లుగా చూపించడంతో  ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. అయితే చివరకు హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అవినాష్ సేఫ్ అయినట్లు హోస్టు నాగార్జున ప్రకటించాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కిందటి వారమే అమ్మ రాజశేఖర్ బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 09:59 AM IST
    Follow us on

    బిగ్ బాస్-4 ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పటిలాగే ఉత్కంఠగా సాగింది. 9వ వారంలో అమ్మ రాజశేఖర్ వెళ్లిపోతాడనే ముందస్తు లీకైనా చివరి వరకు నాటకీయతను తలపించింది. బిగ్ బాస్ హౌస్ చూస్తున్న ప్రేక్షకులకు అవినాష్ ఎలిమినేట్ అవుతాడా? అన్నట్లుగా చూపించడంతో  ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. అయితే చివరకు హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అవినాష్ సేఫ్ అయినట్లు హోస్టు నాగార్జున ప్రకటించాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కిందటి వారమే అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి ఉండేది. అయితే నోయల్ సీన్ అనారోగ్యంతో బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడతో అమ్మ రాజశేఖర్ సేఫ్ అయ్యాడు. అయితే హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్లలో అమ్మ రాజశేఖర్ బలహీన కంటెస్టెంట్
    ఉండటంతో ఆయనకు ఓటింగ్ తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే మాస్టర్ ఎలిమినేషన్ ప్రిపేర్ అయినట్లు కన్పించింది.

    Also Read: బిగ్ బాస్-4: పట్టుకోసం ‘బిగ్ బాస్’తండ్లాట..! వైల్డ్ కార్డ్ గా సుమ

    ఎలిమినేషన్లో భాగంగా చివర్లో అమ్మ రాజశేఖర్.. అవినాష్ మిగిలారు. దీంతో మాస్టర్ ముందుగానే తానే వెళ్లిపోయేది అంటూ తేల్చిచెప్పాడు. హోస్ట్ నాగార్జున సైతం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని.. అవినాష్ సేఫ్ అయ్యాడని చెప్పాడు. తన ఎలిమినేషన్ ను ముందుగానే ఊహించిన మాస్టర్ పెద్దగా ఎమోషనల్ కాకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అనినాష్ మాత్రం బోరున విలపించాడు.

    Also Read: అల్లరి నరేశ్ గురించి ఆసక్తికర విషయాలివీ

    సేఫ్ అయితే ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారుగానీ ఎందుకు ఏడుస్తున్నావని నాగార్జున అనివాష్ ను అడిగాడు. అయితే అవినాష్ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎలిమినేషన్లలో ఉండటంతో తాను మళ్ళీ జీరో అయ్యానని అనిపించిదంటూ ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యిందని నాగార్జునకు దండం పెడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. అవినాష్ ను అలచూసిన అరియానా సైతం కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి నిన్నటి ఎలిమినేషన్ చివరివరకు ఉత్కంఠను రేపింది.