https://oktelugu.com/

‘ఇష్క్’ మూవీ రివ్యూ : హిట్టా? ఫట్టా?

నటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్, రవీంద్ర విజయ్ తదితరులు దర్శకత్వం : ఎస్ ఎస్ రాజు నిర్మాత‌లు : ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌ ఎడిటింగ్ :ఎ వరప్రసాద్ సంగీతం : మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ : సాం కె నాయుడు యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా వచ్చిన సినిమా “ఇష్క్”. నాట్ ఎ లవ్ స్టోరీ అంటూ వచ్చిన ఈ […]

Written By:
  • admin
  • , Updated On : July 31, 2021 12:10 pm
    Follow us on

    Ishq Movie Review and Ratingనటీనటులు : తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్, రవీంద్ర విజయ్ తదితరులు
    దర్శకత్వం : ఎస్ ఎస్ రాజు
    నిర్మాత‌లు : ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
    ఎడిటింగ్ :ఎ వరప్రసాద్
    సంగీతం : మహతి స్వర సాగర్
    సినిమాటోగ్రఫీ : సాం కె నాయుడు

    యంగ్ హీరో తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా వచ్చిన సినిమా “ఇష్క్”. నాట్ ఎ లవ్ స్టోరీ అంటూ వచ్చిన ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

    కథ విషయానికి వస్తే.. !

    సిద్ధుని (తేజ సజ్జా) సిన్సియర్ గా ప్రేమిస్తోంది అను (ప్రియా ప్రకాష్ వారియర్). ప్రేమలో మునిగిన ఈ ఇద్దరూ ఒక రోజు రాత్రి బయటకు వెళ్లి, కారులో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే, ఆ సమయంలో అక్కడికి పోలీస్ గా వచ్చిన మాధవ్ (రవీంద్ర విజయ్) వారి రొమాన్స్ ఫోటోలను తీసి బెదిరించి ఆ రాత్రంతా వాళ్ళను టార్చర్ పెడతాడు. అసలు ఇంతకీ ఈ మాధవ్ ఎవరు ? మాధవ్‌ పై సిద్ధు ఏ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు ? చివరకు సిద్ధు, అనుల లవ్ స్టోరీ ఏ విధంగా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

    విశ్లేషణ :

    తేజ సజ్జ పాత్ర, అతను ఎదుర్కొనే సమస్యలతో సతమతమవుతూ వాటి నుండి బయటపడటానికి ప్రయత్నం చేసే సన్నివేశాలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్‌ తో చేసే రొమాన్స్ కూడా బాగా కుదిరింది. ఇద్దరూ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇక సినిమాలోనే కీలక పాత్రలో నటించిన రవీంద్ర విజయ్ కూడా తన శాడిష్ట్ క్యారెక్టరైజేషన్‌ తో అబ్బురపరిచాడు.

    అయితే, ఫస్ట్ హాఫ్ బాగా బోర్ గా సాగడం, సిద్ధు, అను జంటను మాధవ్ వేధించిన తీరు మరీ స్లోగా సాగడం, అలాగే ఏ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం, దీనికితోడు కథనాన్ని కూడా సరిగ్గా రాసుకోకపోవడం వంటి అంశాలు కారణంగా ఈ సినిమా పూర్తిగా తేలిపోయింది. చిన్న పాయింట్ తో కంటెంట్ లేకుండా సాగుతుంది ఈ సినిమా వ్యవహారం.

    నీరసం తెప్పించే ప్రేమ భావాలు, విసుగు మయంతో సాగే పగ ప్రతీకారం, అర్ధం పర్ధం లేని బిల్డప్ షాట్స్, అన్నిటికి మించి అనవసరంగా ఇరికించిన ఎమోషనల్ టార్చర్.. మొత్తంగా ఇదొక బోరింగ్ సినిమాగా నిలిచింది.

    సాంకేతిక విభాగానికి వస్తే.. నేపధ్య సంగీతం బాగుంది. ఇక సినిమాటోగ్రఫీలో మ్యాటర్ లేదు, ఎడిటింగ్ లో ఏదీ లేదు. ఎడిటర్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుంటూ పోయినట్టు ఉన్నాడు. మరో దౌర్భాగ్యం ఏమిటంటే కాన్సెప్ట్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు.

    ప్లస్ పాయింట్స్ :

    మెయిన్ పాయింట్,ఇంట్రెస్ట్ తో సాగే కొన్ని సీన్స్,
    పాత్రల పరిచయ సన్నివేశాలు,సంగీతం,
    నటీనటుల నటన.

    మైనస్ పాయింట్స్ :

    కంటెంట్ లేని సీన్స్,
    బోరింగ్ ప్లే,
    స్లోగా సాగే కొన్ని సన్నివేశాలు,
    ప్యాడింగ్ లేకపోవడం.

    సినిమా చూడాలా ? వద్దా ? :

    రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ ‘ఇష్క్’లో మ్యాటర్ లేదు. ఉన్న కంటెంట్ లో కూడా క్లారిటీ లేదు. అయితే, రొమాంటిక్ ఎలిమెంట్స్, రివేంజ్ డ్రామా తాలూకు సీన్స్ బాగున్నాయి. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.

    రేటింగ్ : 2.25