Sridevi Soda Center: సినిమా షూటింగ్ అయిపోగానే గర్భం దాల్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ హీరోయిన్?

Sridevi Soda Center: అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నది సామెత. ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడు సంపాదించుకోవాలని హీరోయిన్లు భావిస్తున్నారు. అందుకే హీరోయిన్లు పెళ్లికి సిద్ధమై కూడా సినిమాల్లో గ్రాండ్ హిట్ కావడంతో పెళ్లిళ్లు నిశ్చితార్థలు క్యాన్సిల్ చేసుకొని మరీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రోజులివీ.. రష్మిక మందన్న, మెహ్రీన్ లు ఇలా నిశ్చితార్థాలు రద్దు చేసుకొని సినిమాల్లో కోట్లు సంపాదించేలా ఎదిగారు. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’(Sridevi Soda center) హీరోయిన్ ఆనంది(Anandi) మాత్రం పూర్తి […]

Written By: NARESH, Updated On : August 31, 2021 10:24 am
Follow us on

Sridevi Soda Center: అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నది సామెత. ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్నప్పుడు సంపాదించుకోవాలని హీరోయిన్లు భావిస్తున్నారు. అందుకే హీరోయిన్లు పెళ్లికి సిద్ధమై కూడా సినిమాల్లో గ్రాండ్ హిట్ కావడంతో పెళ్లిళ్లు నిశ్చితార్థలు క్యాన్సిల్ చేసుకొని మరీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రోజులివీ.. రష్మిక మందన్న, మెహ్రీన్ లు ఇలా నిశ్చితార్థాలు రద్దు చేసుకొని సినిమాల్లో కోట్లు సంపాదించేలా ఎదిగారు.

అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’(Sridevi Soda center) హీరోయిన్ ఆనంది(Anandi) మాత్రం పూర్తి డిఫెరెంట్. ఈ అచ్చ తెలుగు హీరోయిన్ ఇటీవల సుధీర్ బాబుతో కలిసి సినిమా చేసింది. అందులో ‘శ్రీదేవి’గా బాగా నటించింది. కథలో కీలక పాత్ర ఈమె. అయితే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వచ్చిన వేళ అసలు ప్రమోషన్లలో ఆనంది కనిపించడం లేదు.

షూటింగ్ అయిపోయాక స్విచ్ఛ్ ఆఫ్ చేసుకున్న ఆనంది ఇప్పటికీ తన ఫోన్ నంబర్లను ఆన్ చేసుకోలేదట.. ఏంటా విషయం అని ఆరాతీస్తే ఈ సినిమా ఇండస్ట్రీ కి దూరంగా వెళ్లి చక్కగా వివాహం చేసుకొని సెటిల్ అయిపోయిందట..

‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ అయిపోగానే ఆనంది వివాహం చేసుకుందట.. ఇప్పుడు ఆమె గర్భవతి అని తేలింది. అందుకే ఈ సినిమా వాళ్లతో సంబంధాలు ఉంటే కొత్త పెళ్లి బంధానికి బీటలు వారుతాయని ఫోన్లు అన్నీ తీసేసిందట.. కొత్త సంసారంలో సుఖంగా జీవిస్తుందట..

తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ వాళ్లు ఎలాగోలా ఆనంది అడ్రస్ తెలుసుకొని ప్రమోషన్లకు రావాలని కోరగా.. తాను గర్భవతిని అని.. పెళ్లి అయిపోయిందని.. అందుకే సినీ ఇండస్ట్రీకి ప్రమోషన్లకు రాలేనని చెప్పిందట.. అలా సినిమా షూటింగ్ అయిపోగానే పెళ్లి చేసుకొని ఏకంగా గర్భం దాల్చిన హీరోయిన్ ఆనంది వ్యవహారం చర్చనీయాంశమైంది.