గ్రేటర్ మేయర్ రేసులో ఈమె.. ఖాయమట?

గ్రేటర్ పోరు ముగిసింది.. ఒక డివిజన్ రీపోలింగ్ మిగిలింది. హైదరాబాదీలు సేమ్ మునుపటిలాగా బయటకు రాలేదు.. ఓటు వేయలేదు. యువత, ఉద్యోగులు, సంపన్న వర్గాలు ఇటువైపే తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే తక్కువగా నమోదైన ఈ పోలింగ్ పార్టీల్లో ఆందోళనకు కారణమవుతోంది. Also Read: గ్రేటర్లో బలబలాలు.. మేయర్ పీఠం దక్కేది ఎవరికీ? పోలింగ్ తక్కువగా నమోదు కావడంపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. అది తమకే లాభిస్తుందని టీఆర్ఎస్ అంటుండగా.. భారీగా మోహరించామని తమకే పడ్డాయని […]

Written By: NARESH, Updated On : December 2, 2020 10:03 am
Follow us on

గ్రేటర్ పోరు ముగిసింది.. ఒక డివిజన్ రీపోలింగ్ మిగిలింది. హైదరాబాదీలు సేమ్ మునుపటిలాగా బయటకు రాలేదు.. ఓటు వేయలేదు. యువత, ఉద్యోగులు, సంపన్న వర్గాలు ఇటువైపే తిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే తక్కువగా నమోదైన ఈ పోలింగ్ పార్టీల్లో ఆందోళనకు కారణమవుతోంది.

Also Read: గ్రేటర్లో బలబలాలు.. మేయర్ పీఠం దక్కేది ఎవరికీ?

పోలింగ్ తక్కువగా నమోదు కావడంపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. అది తమకే లాభిస్తుందని టీఆర్ఎస్ అంటుండగా.. భారీగా మోహరించామని తమకే పడ్డాయని బీజేపీ చెబుతోంది. అయితే ఎక్స్ ఆఫీషియో ఓట్ల కారణంగా గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కే దక్కవచ్చని తెలుస్తోంది.

గ్రేటర్ రిజర్వేషన్ల ప్రకారం ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇన్నేళ్లలో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈసారి మహిళ మేయర్ పీఠంపై కూర్చోనుంది.

Also Read: ఎంఐఎం టార్గెట్ 40.. సాధ్యమవుతుందా?

ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ లో మేయర్ పీఠం కోసం డజను మంది వరకు పోటీలో ఉన్నారు. ఎక్కువగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భార్యలు, కోడళ్లు ఇందుకోసం పోటీపడుతున్నారు.

ప్రధానంగా టీఆర్ఎస్ మేయర్ రేసు చూస్తే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సునరితారెడ్డి (మూసారాంబాగ్) మేయర్ పీఠం కోసం ప్రథమ పోటీదారుగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఆమె గెలుపు కోసం డివిజన్లో శాయశక్తులు ఒడ్డారు. మేయర్ సీటు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సీనియర్ నేత కేకే కుటుంబ సభ్యులు.. తలసాని ఫ్యామిలీ నుంచి అలాగే పద్మారావు కుంటుంబం నుంచి కూడా మేయర్ పీఠం ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మహిళలు రేసులో ఉన్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమే శిరోధార్యంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్