https://oktelugu.com/

‘ఉప్పెన’ హీరోయిన్ తో సుధీర్ ప్రేమ

‘వి’ సినిమాతో యాక్షన్ చేసిన హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు సరికొత్త ప్రేమకథతో మన ముందుకు వస్తున్నారు. సుధీర్ పక్కన ఉప్పెన హీరోయిన్ ను పెట్టి ఈ ప్రేమను పండించేందుకు దర్శకుడు ఇంద్రగంటి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సుధీర్ తో ఓ థియేటర్ ఫోకస్ హౌస్ లో నిలుచోబెట్టి ‘ప్రేమ కథలు నచ్చని మనుషులుండరేమో కదా?’ అంటూ సుధీర్ చెప్పిన డైలాగ్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి.. ‘ప్రేమ లేని జీవితం ఉండదని.. దాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 01:40 PM IST
    Follow us on

    ‘వి’ సినిమాతో యాక్షన్ చేసిన హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పుడు సరికొత్త ప్రేమకథతో మన ముందుకు వస్తున్నారు. సుధీర్ పక్కన ఉప్పెన హీరోయిన్ ను పెట్టి ఈ ప్రేమను పండించేందుకు దర్శకుడు ఇంద్రగంటి రెడీ అయ్యారు.

    ఈ క్రమంలోనే సుధీర్ తో ఓ థియేటర్ ఫోకస్ హౌస్ లో నిలుచోబెట్టి ‘ప్రేమ కథలు నచ్చని మనుషులుండరేమో కదా?’ అంటూ సుధీర్ చెప్పిన డైలాగ్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి.. ‘ప్రేమ లేని జీవితం ఉండదని.. దాన్ని ఎలా మొదలుపెట్టామన్నదే తమ సినిమా’ అని సుధీర్ తేల్చేశాడు.

    మార్చి1న ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేస్తున్నాం.. నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది అంటూ వీడియోలో హీరో సుధీర్ చెప్పారు.

    ప్రేమ కథను చెప్పే యువకుల అనుభవం అంటూ సుధీర్ చెబుతున్నాడు. ఉప్పెన , కృతిశెట్టి ఈ ప్రేమ కథా చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పీజీ విందా-వివేక్ సాగర్ లాంటి ఇండస్ట్రీ టాప్ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేస్తున్నారు.