
భారతదేశంలో మహిళలు బంగారం ప్రియులనే సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో బంగారం కొనుగోలు చేసినా చేయకపోయినా పండగ సమయాల్లో మాత్రం కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్లే బంగారం ఖరీదు అంతకంతకూ పెరుగుతున్నా డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు పండుగల సమయంలో జ్యూవెలరీ సంస్థలు సైతం భారీగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఆఫర్ల ద్వారా సేల్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అయితే దేశంలో కరోనా, లాక్ డౌన్ వల్ల ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. గతేడాదితో పోలీస్తే ఈ సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య బంగారం కొనుగోళ్లు ఏకంగా 30 శాతం తగ్గాయి. బంగారం ధర అంతకంతకూ పెరుగుతుండటం, వివిధ కారణాల వల్ల మారిన పరిస్థితులు బంగారం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గినా ఈటీఎఫ్, బంగారు కడ్డీలు, బంగారు నాణేలకు గతంతో పోలిస్తే డిమాండ్ పెరగడం గమనార్హం.
Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?
మరోవైపు ఇన్వెస్ట్ చేసేవాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదని భావిస్తున్నారు. రోజురోజుకు బంగారం రేటు ఆకాశాన్ని తాకుతుండటంతో బంగారం భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుందని చాలామంది భావిస్తున్నారు. భారత్ లో ఏకంగా 15,140 కోట్ల రూపాయల గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో సైతం ధరలు ఇదే విధంగా ఉండటం గమనార్హం.
Also Read: పేటీఎం యూజర్లకు శుభవార్త.. ఆ చార్జీల రద్దు..?
అయితే బంగారం డిమాండ్ ఇదే విధంగా తగ్గితే రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారత్ లో గతేడాదితో పోలిస్తే డిమాండ్ అంతకంతకూ తగ్గుతుండటం వ్యాపారులను టెన్షన్ పెడుతోంది.