మొదటి టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమిండియా ఇంత బాగా పుంజుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే నడిపించే నాయకుడు విరాట్ కోహ్లీ సెలవు తీసుకొని ఇండియాకు పితృత్వ సెలవుల్లో వెళ్లిపోయారు. తాత్కాలిక నాయకుడు రహానేపై రెండో టెస్టుకు ముందు అస్సలు అంచనాలు లేవు. ఇలాంటి క్లిష్ట సమయంలో టీమిండియా అద్భుతమే చేసింది.
Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. భారత్ లక్ష్యం 70.. ప్రస్తుతం 33/2
ఆస్ట్రేలియతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
టపటపా రెండు వికెట్లు పడ్డ వేళ మళ్లీ టీమిండియా గత టెస్టు మాదిరిగానే కుప్పకూలుతుందా అన్న భయం అభిమానులను వెంటాడింది. అయితే శుభ్ మన్ గిల్ 35, రహానే 27 పరుగులతో క్రీజులో నిలబడి మరీ భారత్ కు విజయ తీరాలకు చేర్చారు. దీంతో మొదటి టెస్టు పరాజయానికి టీమిండియా గట్టి బదులు తీర్చుకుంది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 133/6 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన అసీస్ మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. కామరూన్ గ్రీన్ 45 పరుగులతో టాప్ లో నిలిచాడు.టెయింలెండర్ల పోరాటంతో ఆస్ట్రేలియా స్కోరు 200 దాటింది. చివరి నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా ఏకంగా 101 పరుగులు చేయడం విశేషం. కమిన్స్, గ్రీన్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని పరుగులు సాధించారు. చివర్లో హేజిల్ వుడ్ 10, స్టార్క్ 14 నిలబడి ఆస్ట్రేలియాకు పరుగులు చేశారు.
Also Read: విరాట్ కోహ్లీ గొప్ప ఘనత.. దశాబ్ధపు మేటి క్రికెటర్
ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మరోసారి పేలవ ఫామ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 15 బంతులు ఆడి 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పూజారా సైతం మరోసారి తడబడి 3 పరుగులకే ఔట్ అయ్యాడు.
అయితే కెప్టెన్ రహానే, ఓపెనర్ శుభ్ మన్ గిల్ లు ధాటిగా ఆడుతూ ఫోర్లు కొడుతూ టీమిండియాను గెలిపించారు. అయితే పకడ్బందీ ఆస్ట్రేలియా బౌలింగ్ ను వీరు కాచుకొని మరీ గెలిపించడం విశేషం.