https://oktelugu.com/

అసీస్ కు గర్వభంగం.. భారత్ చేసిన అద్భుతం

జాత్యంహకార వ్యాఖ్యలు.. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ పై అభిమానుల మాటల దాడి.. సగం జట్టు గాయాలతో చివరి టెస్టు కు దూరం.. బీగ్రేడ్ టీంతో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమే చేసింది. యువకులు కసిగా.. పట్టుదలగా ఆడారు. సీనియర్లు చాలా మంది లేని లోటును అందిపుచ్చుకున్నారు. అహంతో విర్రవీగిన ఆస్ట్రేలియన్లను, ఆస్ట్రేలియా అభిమానులను చావుదెబ్బ తీశారు. Also Read: వాహ్‌.. టీమిండియా.. అద్భుతం.. అనూహ్యం.. విజయం అంటే ఇదీ అనేలా భారత జట్టు ఆడిన తూర్పు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 08:48 PM IST
    Follow us on

    జాత్యంహకార వ్యాఖ్యలు.. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ పై అభిమానుల మాటల దాడి.. సగం జట్టు గాయాలతో చివరి టెస్టు కు దూరం.. బీగ్రేడ్ టీంతో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమే చేసింది. యువకులు కసిగా.. పట్టుదలగా ఆడారు. సీనియర్లు చాలా మంది లేని లోటును అందిపుచ్చుకున్నారు. అహంతో విర్రవీగిన ఆస్ట్రేలియన్లను, ఆస్ట్రేలియా అభిమానులను చావుదెబ్బ తీశారు.

    Also Read: వాహ్‌.. టీమిండియా.. అద్భుతం.. అనూహ్యం..

    విజయం అంటే ఇదీ అనేలా భారత జట్టు ఆడిన తూర్పు నిజంగా ప్రశంసనీయమనే చెప్పాలి. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా ఓటమి ఎరుగకుండా జైత్ర యాత్ర చేస్తున్న అసీస్ మెడలు వంచి సెకండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 300 పైచిలుకు లక్ష్యాన్ని భారత్ సాధించిన తీరు నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    పట్టుదల, కసి, అంకితభావం, దేశానికి ఆడుతున్నామన్న భావోద్వేగంతో రక్త ఉరకలు వేస్తున్న యువ భారత జట్టు దుర్భద్యంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడంతో క్రికెట్ చరిత్రలోనే గొప్ప విజయంగా మాజీ క్రికెటర్లు, ప్రముఖులు, ఆస్ట్రేలియన్లు కూడా అభినందిస్తున్నారు.

    ఆస్ట్రేలియతో చివరిరోజు అద్భుతమే చేశారు టీమిండియా యువ ఆటగాళ్లు 324 పరుగుల లక్ష్యాన్ని సాధించేశారు. ఇందులో శుభ్ మన్ గిల్ 91 పరుగులతో పునాధి వస్తే పూజారా వికెట్ల పతనాన్ని అడ్డుకొని పరుగులు చేశాడు. ఇక పంత్ 89 పరుగులతో భారత్ ను గెలిపించాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ చక్కటి సహకారాన్ని అందించాడు.

    Also Read: ఇంగ్లండ్‌ టూర్‌‌కు ఇండియా జట్టు ఎంపిక నేడే

    అసీస్ కు గర్వభంగం కలిగేలా భారత ఆటగాళ్లు పోరాడారు. తమను తాము నిరూపించుకోవాలన్న కసిని ప్రదర్శించారు. అందుకే 32 ఏళ్లలో ఓటమి ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించారు. పోయినసారి స్మిత్, వార్నర్ లేకుండా గెలిచారని భారత్ జట్టును అవహేళన చేసిన ఆస్ట్రేలియా మాజీలకు ఇప్పుడు వారిద్దరూ ఉన్న భారత బ్రిగేడ్ టీంతో ఓడించి చెంప వాయించేలా ఈ మెసేజ్ ఇచ్చారు.