భారత్ 337 ఆలౌట్.. ఇంగ్లండ్ 4 వికెట్లు ఫట్.. రసకందాయంలో చెన్నై టెస్ట్

చెన్నై టెస్టు మలుపులు తిరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 337 పరుగులకే ఆలౌట్ కావడంతో 240 పై చిలుకు లీడ్ ను ఇంగ్లండ్ జట్టు సాధించింది. అయితే అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ 27 పరుగులతో ఎదురునిలుస్తున్నాడు. అశ్విన్ ఏకంగా 10 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం […]

Written By: NARESH, Updated On : February 8, 2021 1:38 pm
Follow us on

చెన్నై టెస్టు మలుపులు తిరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 337 పరుగులకే ఆలౌట్ కావడంతో 240 పై చిలుకు లీడ్ ను ఇంగ్లండ్ జట్టు సాధించింది. అయితే అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ 27 పరుగులతో ఎదురునిలుస్తున్నాడు.

అశ్విన్ ఏకంగా 10 ఓవర్లలోనే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 320 పరుగులతో లీడ్ లో ఉంది. ఈరోజు ఇంగ్లండ్ ను 400 లోపు ఆలౌట్ చేస్తే ఆఖరి రోజు ఆ లక్ష్యాన్ని ఇండియా ఛేధిస్తుందా? చేతులెత్తేస్తుందా అనేది చూడాలి.

ఎందుకంటే ఇలానే ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో పంత్, పూజారా ధాటిగా ఆడి 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేధించి గెలిపించారు. పంత్ ట్వంటీ ట్వంటీలా ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. దీంతో గెలుపుపై మరోసారి భారత అభిమానులు ఆశలు పెంచుకున్నారు.

ఈరోజు సాయంత్రంలోపు ఇంగ్లండ్ ను ఆల్ ఔట్ చేస్తేనే టీమిండియాకు చాన్స్ ఉంటుంది. ఇంగ్లండ్ కనుక 400 పైచిలుకు స్కోర్ సాధిస్తే మాత్రం ఇండియా ఆఖరి రోజు అంత కాచుకోవడం కష్టమేనంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..