కేసీఆర్ పక్కన కూర్చున్నారు.. వాళ్లకు ఎఫెక్ట్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కూర్చున్న వారందరూ అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమైంది. ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. ఆ గ్రామంలో పర్యటించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేసీఆర్ తోపాటు మాస్కులు తీసేసి భోజనం చేసిన 18మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయిన తర్వాత బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. అదేరోజు రాత్రి […]

Written By: NARESH, Updated On : June 26, 2021 10:33 am
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన కూర్చున్న వారందరూ అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమైంది. ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. ఆ గ్రామంలో పర్యటించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కేసీఆర్ తోపాటు మాస్కులు తీసేసి భోజనం చేసిన 18మంది అస్వస్థతకు గురయ్యారు.

సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయిన తర్వాత బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. అదేరోజు రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను భవనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆగమ్మ పరిస్థితి మెరుగైందని వైద్యులు తెలిపారు.

ఇక సీఎంతో పాటు సహపంక్తి భోజనం చేసిన బాలిక అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం బాలికను ఇంటికి పంపించారు. గ్రామంలో మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధ పడుతుండడంతో వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ తోపాటు సభలో పాల్గొన్న వారందరికీ ఇంటింటికి తిరిగి వారికి మెరుగైన వైద్యం అందించినట్టు ప్రభుత్వ వైద్యులు తెలిపారు.

అయితే గ్రామస్థులు అనారోగ్యం బారినపడడానికి కలుషిత ఆహారం కారణం కాదని.. సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొన్నారని.. 18మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. తీసుకున్న ఆహారం పడకపోవడం వల్లే అస్వస్థతకు గురైనట్టు తెలిపారు.