అయితే ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర హీరోలతో పాటు మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా హీరో రామ్ కూడా చేరాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్న సినిమాని పాన్ ఇండియా ఫిల్మ్ గా తీసుకొస్తున్నాడు. అసలు ఎవరేజ్ హీరోలకు పాన్ ఇండియా బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ?
పైగా తమ పాన్ ఇండియా సినిమాల కోసం ఏకంగా సంవత్సరాలకు సంవత్సరాలను టైంను పెట్టేస్తే.. ఉన్న ఇమేజ్ కే మోసం వస్తే..? నిజానికి మంచు మనోజ్ కి ఒకప్పుడు మినిమమ్ మార్కెట్ ఉండేది. కానీ సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో మనోజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనోజ్ పాన్ ఇండియా సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. కానీ కనీస ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం లేదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
మొత్తమ్మీద పాన్ ఇండియా ఒక్క ప్రభాస్ కి తప్ప, మరో ఏ హీరోకి వర్కౌట్ అయ్యేలా లేదు. పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రభాస్ కి కూడా వర్కౌట్ అవ్వడానికి ఏకైక కారణం.. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్క్లూజన్’ చిత్రాలు. ఈ సినిమాలతో ప్రభాస్ కి అంతర్జాతీయ స్థాయిలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది. మరి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్’ రిలీజ్ తరువాత ఎన్టీఆర్, రామ్‌చరణ్ లకు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల హీరోలు అనే ఇమేజ్ రావొచ్చు. కానీ తెలుగు ఎవరేజ్ హీరోలకు పాన్ ఇండియా ఎప్పటికీ వర్కౌట్ కాదు.