https://oktelugu.com/

వదినతో రొమాన్స్.. ఆంటీతో పెర్ఫామెన్స్.. చివరికి విషాదం

కట్టుకున్న భార్య అనారోగ్యంతో చనిపోయింది. చిన్నపిల్లలున్న అతడు వారిని సాకడానికి ఎవరూ లేక భార్య తల్లి ఇంటికెళ్లాడు. అత్తగారింట్లో పైన టెర్రస్ పైన ఉంటూ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కిందే కాపురం ఉంటున్న భార్య అక్కతో అతగాడికి పరిచయమైంది.అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్తకు తెలిసినా.. భార్యను, తమ్ముడి వరుస అయ్యే అతడిని ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. అయితే మరిది-వదిన మధ్య బంధం మరింతగా బలపడింది. ఇద్దరూ రెచ్చిపోయేవారు. అలా రోజులు గడిచే కొద్దీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2021 / 12:51 PM IST
    Follow us on

    కట్టుకున్న భార్య అనారోగ్యంతో చనిపోయింది. చిన్నపిల్లలున్న అతడు వారిని సాకడానికి ఎవరూ లేక భార్య తల్లి ఇంటికెళ్లాడు. అత్తగారింట్లో పైన టెర్రస్ పైన ఉంటూ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కిందే కాపురం ఉంటున్న భార్య అక్కతో అతగాడికి పరిచయమైంది.అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్తకు తెలిసినా.. భార్యను, తమ్ముడి వరుస అయ్యే అతడిని ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు.

    అయితే మరిది-వదిన మధ్య బంధం మరింతగా బలపడింది. ఇద్దరూ రెచ్చిపోయేవారు. అలా రోజులు గడిచే కొద్దీ వీరి మధ్య బంధం మరింతగా పెరిగింది.  అయితే మరిది తాజాగా ఇంకొక మహిళకు దగ్గరయ్యాడు. ఆమెతోనూ ఎఫైర్ పెట్టుకున్నాడు. అదే చిచ్చు పెట్టింది. ఆ మహిళ చావుకు కారణమైంది..

    తమిళనాడులోని కాంచీపురం జిల్లా కున్రతూర్ ప్రాంతంలో పొన్నురంగం, షెన్ బాగవల్లి దంపతులు నివాసం ఉంటున్నారు.  పెయింటర్ గా పనిచేసే పొన్నురంగం భార్య భాగవల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. భాగవల్లికి లావణ్య అనే చెల్లెలు ఉంది. లావణ్యకు, జోసెఫ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.  మూడు సంవత్సరాల క్రితం రెండో బిడ్డకు జన్మనివ్వడానికి లావణ్య ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడ లావణ్య చనిపోయింది. భార్య చనిపోవడంతో పిల్లలను సాకలేని జోసెఫ్ నాలుగు సంవత్సరాల కుమారుడు, చిన్నారితో కలిసి భార్య తల్లిగారింటికి షిఫ్ట్ అయ్యాడు. అత్తింట్లో తన పిల్లలను పెట్టి పనులు చేసుకునేవాడు.

    ఈక్రమంలో జోసెఫ్ కు, లావణ్య అక్క భాగవల్లితో అక్రమ సంబంధం ఏర్పడింది. వదిన భాగవల్లితో జోసఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.  జోసెఫ్ గత ఏడాది అమృత అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వదిన భాగవల్లిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన జోసెఫ్ పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రియురాలు అమృతతో ఫుల్ టైమ్ జల్సా చేశాడు. దీంతో భాగవల్లి మరిదితో గొడవ పడింది. తనకు అన్యాయం చేయొద్దని కోరింది. ఇటీవల జోసెఫ్ భాగవల్లి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

    ఈ నేపథ్యంలో జోసెఫ్ నిర్వాకంతో విసిగిపోయిన వదిన తనువు చాలించాలని తలపించింది. తన చావుకు మరిది జోసెఫ్ కారణమని  ఒక వీడియో తీసుకొని దాన్ని తన భర్త, బంధువులకు పంపించి ఆత్మహత్యకు పాల్పడింది. భాగవల్లి విడుదల చేసిన వీడియో ఆధారంగా కేసు విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధాలు వారి కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమయ్యాయి.