https://oktelugu.com/

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 29,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు..?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 920 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్‌ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 5, 2021 / 03:48 PM IST
    Follow us on

    ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 920 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్‌ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
    https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 920 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా కనీసం 55 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

    మొదటి ఏడాది నెలకు 29,000 రూపాయలు, రెండో ఏడాది నెలకు 31,000 రూపాయలు, మూడో ఏడాది నెలకు 34,000 రూపాయలు వేతనం చెల్లిస్తారు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు పరీక్ష జరగగా ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున 90 నిమిషాలు పరీక్ష సమయంగా ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 200 రూపాయలు, ఇతరులకు 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. సెప్టెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి ఉన్న అభర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.