భాగ్యనగర రోదన.. ఆగని వాన.. అనుక్షణం భయంభయం

భాగ్యనగరం కన్నీటి సంద్రాన్ని తలపిస్తోంది… 10రోజులుగా కంటి మీద కునుకు లేదు.. తిండి, మంచినీళ్లు లేవు.. మురుగు నీటి మధ్య సహవాసం చేస్తూ ఏ క్షణాన ఏ వరద వస్తుందోనని భయం భయంగా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వానలో తడిసి.. తడిసి ముద్దవుతూ.. ఇంకా ఇలా ఎన్ని రోజులు దీనంగా బతుకాలో తెలియక జీవనం సాగిస్తున్నారు. పండుగ వరకైనా తమ కష్టాలు తీరుతాయా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. వందల కాలనీల్లో మొదలైన వరద సమస్య ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : October 21, 2020 11:59 am
Follow us on

భాగ్యనగరం కన్నీటి సంద్రాన్ని తలపిస్తోంది… 10రోజులుగా కంటి మీద కునుకు లేదు.. తిండి, మంచినీళ్లు లేవు.. మురుగు నీటి మధ్య సహవాసం చేస్తూ ఏ క్షణాన ఏ వరద వస్తుందోనని భయం భయంగా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వానలో తడిసి.. తడిసి ముద్దవుతూ.. ఇంకా ఇలా ఎన్ని రోజులు దీనంగా బతుకాలో తెలియక జీవనం సాగిస్తున్నారు. పండుగ వరకైనా తమ కష్టాలు తీరుతాయా అని దీనంగా ఎదురు చూస్తున్నారు. వందల కాలనీల్లో మొదలైన వరద సమస్య ఇప్పుడు వేలాది కాలనీలకు విస్తరిస్తోంది.. తగ్గిందనుకునే లోపే మళ్లీ మళ్లీ వర్షం కొడుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మరోసారి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఉప్పల్, బండ్లగూడలో గరిష్ఠంగా 5.08సెం.మీ వాన పడింది. అబిడ్స్, కోటి తదితర ప్రాంతాలు జలమయమ్యాయి.

Also Read: ‘దుబ్బాక’ ప్రచారం ఎవరు ముందున్నారంటే?

నగరంతో పాటు పలు శివారు కాలనీల్లో అంధకారం నెలకొంది. కూకట్ పల్లి, అల్వాల్, హయత్ నగర్, చాంద్రాయణ్ గుట్ట,సరూర్ నగర్, మెహదీ పట్నం, రాజేంద్ర నగర్ మధ్య నున్న ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సోమవారం నాటికి వరద తగ్గుముఖం పట్టినా మంగళవారం వానతో మళ్లీ పెరిగింది. పలు కాలనీల్లో సొంతిళ్లలోకి వెళ్లేటట్టు లేకపోవడంతో జనాలు ఆకలి, దప్పిక, కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పునరావస కేంద్రాల్లో అరకొర సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరదలతో ఇబ్బందులు పడుతన్న నగర జనాలను ఆదుకోవడానికి ఇండియన్ ఆర్మీ ముందుకొచ్చింది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు మరి కొన్ని రోజులు సేవలందించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నందున.. ప్రస్తుత 6వరద సహాయక బృందాలకు తోడు అదనంగా 9 బృందాలను పడవలతో సిద్ధంగా ఉంచినట్లు ఆర్మీ ఆఫీసర్లు చెప్పారు.

Also Read: ఇస్లాం ప్రపంచం సెక్యులరిజంతో ఎందుకు ఘర్షణ పడుతుంది?

బాధిత కాలనీల్లో ఎక్కడ చూసినా నడుంలోతు వరద, మోకాల్లోతు బురద కనిపిస్తోంది. ముంపు తగ్గినప్పుడు భరించలేని దుర్వాసన తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో క్రిమికీటకాలు, పాములు, పశువులు, ఇతర ప్రాణుల కళేబరాలు తేలుతున్నాయి. సరైన నీళ్లు లేక ప్రజలు జ్వరం, డయేరియా ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలామంది ఫీవర్ హాస్పిటల్కు క్యూ కడుతున్నారు.