https://oktelugu.com/

భార్గవ్ రామ్ కోసం వేట.. అఖిలప్రియ బెయిల్ పై ఉత్కంఠ

ఎరక్కపోయి ఇరుకున్న టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త ఇప్పుడు కిడ్నాప్ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలుకు వెళ్లగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ మాత్రం పరారీలో ఉన్నాడు. Also Read: జగన్ లేఖ.. సుప్రీ జడ్జి వివరణ.. స్పందించిన సుప్రీంకోర్టు అయితే తాజాగా తెలంగాణ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్ మొదట బెంగళూరు వెళ్లాడని.. అక్కడి నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 8, 2021 / 12:21 PM IST
    Follow us on

    ఎరక్కపోయి ఇరుకున్న టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త ఇప్పుడు కిడ్నాప్ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలుకు వెళ్లగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ మాత్రం పరారీలో ఉన్నాడు.

    Also Read: జగన్ లేఖ.. సుప్రీ జడ్జి వివరణ.. స్పందించిన సుప్రీంకోర్టు

    అయితే తాజాగా తెలంగాణ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్ మొదట బెంగళూరు వెళ్లాడని.. అక్కడి నుంచి మైసూర్ కు జారుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు బృందాలను భార్గవ్ రామ్ కోసం విడివిడిగా తెలంగాణ పోలీసులు పంపారు. వారి కోసం జల్లెడ పడుతున్నారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన వైనం సంచలనమైంది. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఇతడి సోదరుడు, ఏవీ సుబ్బారెడ్డిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూమి గురించే ఈ కిడ్నాప్ చోటు చేసుకుంది.

    Also Read: పట్టు వీడని రైతులు.. మెట్టు దిగని కేంద్రం

    ఇక సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఏపీ పోలీసుల సాయాన్ని కూడా తెలంగాణ పోలీసులు తీసుకుంటూ కేసులో భార్గవ్ రామ్ ను పట్టుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. అతడు చిక్కితే కేసులో మరిన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయని భావిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్