https://oktelugu.com/

దేశంలోనే అత్యధికం.. కీరవాణి పారితోషికం..ఎంతంటే?

దేశంలోనే ఏంటి.. ? ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా టాలీవుడ్ సీనియర్ ఎంఎం కీరవాణి నిలిచాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన తమ్ముడు , దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దానికి గాను ఈ భారీ పారితోషికాన్ని కీరవాణీ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాల్లో అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించిన కీరవాణికి ఆ సినిమాకు గాను పెద్దమొత్తంలోనే ప్యాకేజీ దక్కింది. నిజానికి రాజమౌళి సినిమా అంటే కుటుంబం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2021 / 04:59 PM IST
    Follow us on

    దేశంలోనే ఏంటి.. ? ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా టాలీవుడ్ సీనియర్ ఎంఎం కీరవాణి నిలిచాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన తమ్ముడు , దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దానికి గాను ఈ భారీ పారితోషికాన్ని కీరవాణీ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.

    బాహుబలి సినిమాల్లో అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించిన కీరవాణికి ఆ సినిమాకు గాను పెద్దమొత్తంలోనే ప్యాకేజీ దక్కింది. నిజానికి రాజమౌళి సినిమా అంటే కుటుంబం మొత్తం ప్యాకేజీ తీసుకుంటారు. బాహుబలి సినిమాకు గాను అందరూ కలిసి దాదాపు 100 కోట్ల వరకు తీసుకున్నట్టు ఇండస్ట్రీలో ఓ ప్రచారం ఉంది. ఇక ఎంఎం కీరవాణికి రూ.15 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు టాక్.

    అందుకే కీరవాణి ఇక బయట సినిమాలకు చేయకుండా కేవలం తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ లో థమన్, దేవీశ్రీ ప్రసాద్ లకు పెద్ద సినిమాలకు రూ.3 కోట్ల పారితోషికం ఇస్తారు. అయితే కీరవాణి మాత్రం ఒక్క తమ్ముడి సినిమాకే భారీగా అందుకుంటున్నాడట.. అందుకే ఇక తన కృషిని, సంగీతాన్ని తమ్ముడు రాజమౌళి సినిమాకే పెడుతూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ కు కూడా ఏకంగా కీరవాణి రెమ్యూనరేషన్ గా 18 కోట్లు తీసుకుంటున్నట్టు భోగట్టా. మరి ఇది నిజమా? కాదా అన్నది పక్కనపెడితే అంత తీసుకుంటే మాత్రం అదో సంచలన విషయంగానే చెప్పొచ్చు.