https://oktelugu.com/

బీచ్ లో బీర్ కొడుతూ జగపతిబాబు, శర్వానంద్ రచ్చ

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘మహాసముద్రం’. జగపతి బాబు కీలక పాత్రధారి. ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తర్వాత అజయ్ భూపతి తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి పాత హీరోయిన్‘రంభ’ మీద ఒక అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఊర మాస్ పాటలాగా ఇది ఊపేసేలా కనిపిస్తోంది. ఈ పాటపై విశాఖపట్నం బీచ్ లో హీరో శర్వానంద్, జగపతిబాబు […]

Written By: , Updated On : August 6, 2021 / 01:24 PM IST
Follow us on

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘మహాసముద్రం’. జగపతి బాబు కీలక పాత్రధారి. ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తర్వాత అజయ్ భూపతి తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి పాత హీరోయిన్‘రంభ’ మీద ఒక అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఊర మాస్ పాటలాగా ఇది ఊపేసేలా కనిపిస్తోంది.

ఈ పాటపై విశాఖపట్నం బీచ్ లో హీరో శర్వానంద్, జగపతిబాబు కలిసి బీర్ కొడుతూ ఊపేసేలా ‘రంభ.. రంభ’ అంటూ పాడిన పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. విశాఖ బీచ్ లో బీర్ కొడుతూ ‘రంభ’ కటౌట్లు చూసి పాడిన ఈ పాటను తాజాగా చిత్రం యూనిట్ విడుదల చేయగా వైరల్ అయ్యింది. ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా కనిపిస్తోంది.

ఆర్ఎక్స్ 100లో ఇదే సంగీత దర్శకుడు చైతన్య భరద్వాజ్ మంచి సంగీతం అందించాడు. ఇప్పుడు అదే అజయ్ భూపతి రెండో సినిమాకు వీరిద్దరూ అలాంటి మంచి పాటలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

Maha Samudram - Hey Rambha Rambha Lyrical | Sharwanand | Siddharth | Chaitan Bharadwaj, AjayBhupathi