
హీరోయిన్ అంజలి చాలా డిసిప్లేన్ గల నటి. నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నా.. నలుగురిలో ఉన్నప్పుడు చాల పద్దతిగా ఉండేదని ఆమెతో పని చేసిన నిర్మాతలు చెబుతుండే వారు. నిజానికి అంజలి జూనియర్ ఆర్టిస్ట్ నుండి ఎదిగింది. హీరోయిన్ అవ్వడానికి ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ మేనేజర్ చేతిలో ఆమె మోసపోయింది అని కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇవ్వన్నీ చూసింది కనుకనే.. అంజలి మొదటి నుండి అందరితో మంచిగా ఉంటూ కెరీర్ ను బాగా బిల్డ్ చేసుకుంది.
అయితే కరెక్ట్ గా ఎదిగే టైంలో పర్సనల్ లైఫ్ లో చికాకులతో పాటు ఓ హీరోతో సాగించిన ప్రేమాయణం కూడా అంజలిని మెంటల్ బాగా పాడు చేశాయి. అంజలి, హీరో జైతో ఎప్పుడైతే ప్రేమలో పడిందో అప్పటినుండి ఆమెకు నటన ఫై ఆసక్తి పోయిందట. జైతో ప్రేమలో పడకముందు షూటింగ్ కి పావు గంట ముందు వచ్చి సెట్ లో కూర్చునే అంజలి, జైతో పరిచయం తరువాత అసలు షూటింగ్ కోసం టైంకి రావడమే మానేసిందట. షూటింగ్ సమయానికి రాకపోవడమే కాకుండా.. సెట్ లో డైరెక్టర్ చెప్పేది కూడా వినేది కాదట. ఒకటి రెండు సినిమాలకు అంజలి అలాగే మిస్ బిహేవ్ చేసిందని.. కానీ ఆ రెండు సినిమాల నుండే ఆమెకు అవకాశాలు తగ్గాయట.
కాలిపోయిన చేతులు చూసుకోకుండా ఇక ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది ? మొత్తానికి కెరీర్ ను సర్వనాశనం చేసుకున్న తరువాత అంజలి మేల్కొంది. ఆ హీరోని దూరం పెట్టింది. పైగా గతంలో తన వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి నిర్మాతకు ఫోన్ చేసి.. మీ కోసం మీకు నచ్చిన రెమ్యునరేషన్ కి మళ్ళీ మీ బ్యానర్ లో సినిమా చేస్తాను అంటూ చేసిన తప్పులను మర్చిపోయేలా చేయడానికి అంజలి చాల కష్టపడింది. ఈ క్రమంలోనే ఆమెకు వకీల్ సాబ్ సినిమా దక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి, మళ్ళీ తెలుగు అవకాశాల కోసం కలలు కంటుంది.