గ్రేటర్ ‘ఫెయిల్యూర్’.. ఓటర్లది కాదా.. మరీ ఎవరిదీ?

తెలంగాణ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిల పోలింగ్ నిన్న సాయంత్రం ముగిసింది. సాయంత్ర 5గంటల వరకు ఓటింగ్ శాతం ప్రకారంగా చూస్తే 36శాతంగా నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 45పైగా ఉంటే ఈసారి 50శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం భావించింది. అయితే ఓటర్లు మాత్రం ఊహించని విధంగా ఎన్నికల సంఘానికి.. అన్ని రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చారు. Also Read: గ్రేటర్ మేయర్ రేసులో ఈమె.. ఖాయమట? గతంలో కంటే దాదాపు 8నుంచి 10శాతం ఓటింగ్ […]

Written By: Neelambaram, Updated On : December 2, 2020 2:17 pm
Follow us on

తెలంగాణ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిల పోలింగ్ నిన్న సాయంత్రం ముగిసింది. సాయంత్ర 5గంటల వరకు ఓటింగ్ శాతం ప్రకారంగా చూస్తే 36శాతంగా నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 45పైగా ఉంటే ఈసారి 50శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం భావించింది. అయితే ఓటర్లు మాత్రం ఊహించని విధంగా ఎన్నికల సంఘానికి.. అన్ని రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చారు.

Also Read: గ్రేటర్ మేయర్ రేసులో ఈమె.. ఖాయమట?

గతంలో కంటే దాదాపు 8నుంచి 10శాతం ఓటింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది. విద్యావంతులు అత్యధికంగా నివసించే హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం మరీ తక్కువగా నమోదుకావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాదీలు బద్ధకస్తులు.. వాళ్లకు సిక్త్ సెన్స్ లేదని.. ఓటింగ్ పాల్గొనని వాళ్లకు ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అయితే గ్రేటర్ ‘ఫెయిల్యూర్’కు కారణం ఓటర్లు కాదని.. కేవలం రాజకీయ పార్టీలు.. ఎన్నికల సంఘానిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థలైన జీహెచ్ఎంసీ ఇంచుమించుగా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. అధికార పార్టీకి పోటీగా మిగతా పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం.. హైదరాబాద్ అభివృద్ధి గురించి కంటే కూడా అనవసర విషయాలపై పార్టీలు ప్రచారం చేయడంతో నగర ఓటర్లు విసిగిపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లో ఏ పార్టీ గెలిచినా చేసేదీ ఏమిలేదని.. తమకు రావాల్సిన ఉచితాలు అవే వస్తాయని నగరవాసులు ఆలోచనకు రావడం ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా కన్పిస్తోంది. దీనికితోడు టీఆర్ఎస్.. బీజేపీలు చావోరోవో అన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం.. ఓటింగ్ ముందురోజు కూడా ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం వంటి అంశాలు నగరవాసుల్లో భయాందోళనకు గురిచేసినట్లు కన్పిస్తోంది. దీంతో ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలవైపు పెద్దగా చూడలేదు.

Also Read: గ్రేటర్లో బలబలాలు.. మేయర్ పీఠం దక్కేది ఎవరికీ?

ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు విదేష్వాలు పెంచేలా ప్రసంగాలు.. దాడులు చేసుకున్నా ఎన్నికల సంఘం కూడా చూసిచూడనట్లు వ్యవహరింది. పోలింగ్ ఒకరోజు ముందు తుతుమంత్రంగానే హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా సెలవులు వచ్చిన సమయంలో ఎన్నికలు నిర్వహించడం కూడా ఎన్నికల సంఘం తప్పిదంగా కన్పిస్తోంది. ఇక ఓటర్లు లిస్టు ఎన్నికల సంఘం సరిగా ప్రిపేర్ చేయలేదని ఆరోపణలు విన్పించాయి.

దీనికితోడు హైదరాబాద్ ఎక్కువ సంఖ్యలో ఉండే టెక్కీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్లంతా ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడం ఓటింగ్ శాతంపై ప్రభావం చూపింది. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి నగర ఓటర్లే కారణమని బూచీ చూపుతూ మిగతా వ్యవస్థలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం శోచనీయంగా మారింది.

ఇప్పటికైనా ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలు తమ వైఖరిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు.. దాని వినియోగించుకునేందుకు ఓటర్లు ఎప్పుడు ముందే ఉంటారు. అయితే వారంతా పోలింగ్ కేంద్రాలు వచ్చేలా చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల సంఘం.. ప్రభుత్వాలపైనే ఉందనే విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు. మొత్తానికి గ్రేటర్ వాసులు ఇచ్చిన ఝలక్.. ప్రతీఒక్కరిని ఆలోచింపజేస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్