పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించేదెవరు?

  గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ పట్టభద్రుల ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ముందుస్తు ఎన్నికల నిర్వహించడంతో ప్రధాన పార్టీలన్నీ దెబ్బతినగా బీజేపీ మాత్రం సత్తా చాటింది. టీఆర్ఎస్ గతంలో కంటే తక్కువ స్థానాలకు గెలుపొందగా కాంగ్రెస్ రెండు సీట్లతో బొక్కాబోర్లా పడింది. ఎంఐఎం తన ప్రభావాన్ని మరోసారి చాటింది. ఇక త్వరలోనే వరంగల్-ఖమ్మం-నల్గొండతోపాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే ఎన్నికల ఓటర్ల జాబితాపై […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 11:38 am
Follow us on

 

గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో పార్టీలన్నీ పట్టభద్రుల ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ముందుస్తు ఎన్నికల నిర్వహించడంతో ప్రధాన పార్టీలన్నీ దెబ్బతినగా బీజేపీ మాత్రం సత్తా చాటింది. టీఆర్ఎస్ గతంలో కంటే తక్కువ స్థానాలకు గెలుపొందగా కాంగ్రెస్ రెండు సీట్లతో బొక్కాబోర్లా పడింది. ఎంఐఎం తన ప్రభావాన్ని మరోసారి చాటింది.

ఇక త్వరలోనే వరంగల్-ఖమ్మం-నల్గొండతోపాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే ఎన్నికల ఓటర్ల జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లురుతుండగా కాంగ్రెస్.. వామపక్షాలు.. టీఆర్ఎస్ పార్టీలు పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

గ్రేటర్ల పోలైన పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ సత్తాచాటింది. దీంతో పట్టభద్రులంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు స్పష్టం కావడంతో ఈ రెండు స్థానాలపై కమలదళం గురిపెట్టింది. టీఆర్ఎస్ సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో టచ్లో ఉండే నాయకులకే ఈసారి టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈమేరకు నేతలంతా మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమతో కలిసే వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వామపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది.

ప్రధాన పార్టీలన్నింటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాలుగా మాారాయి. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ఏ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుందనే ఆసక్తికరంగా మారింది.