వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అందుబాటులోకి ఆ సేవలు..?

స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. త్వరలో వాట్సాప్ క్లౌడ్ హోస్టింగ్, ఇన్ యాప్ కొనుగోళ్లను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ ఫేస్ బుక్ షాప్స్ పేరుతో యూజర్లను తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ఫేస్ బుక్ షాప్స్ పేరుతో ఆన్ లైన్ స్టోర్ ను అందుబాటులోకి […]

Written By: Navya, Updated On : October 23, 2020 11:21 am
Follow us on

స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. త్వరలో వాట్సాప్ క్లౌడ్ హోస్టింగ్, ఇన్ యాప్ కొనుగోళ్లను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ ఫేస్ బుక్ షాప్స్ పేరుతో యూజర్లను తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ఫేస్ బుక్ షాప్స్ పేరుతో ఆన్ లైన్ స్టోర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Also Read: ఇక ఆంక్షల్లేవ్.. ఏ దేశమైనా ఎగిరిపోవచ్చు!

ఫేస్ బుక్ షాప్స్ ద్వారా క్లౌడ్ హోస్టింగ్, ఇన్ యాప్ సేవలను ప్రారంభిస్తే వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది. ఫేస్ బుక్ ఈ నిర్ణయం ద్వారా ఆదాయం మరింత పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ బుక్ ఆరు సంవత్సరాల క్రితం 19 బిలియన్ డాలర్లు చెల్లించి వాట్సాప్ ను కొనుగోలు చేస్తోంది. ఫేస్ బుక్ తమ ఇతర అప్లికేషన్ల ద్వారా విక్రయాలను పెంచుకోవాలని భావిస్తోంది.

ఫేస్ బుక్ ఈ నిర్ణయం ద్వారా క్లౌడ్ హోస్టింగ్ సేవలను అందించవచ్చు. తమ వినియోగదారులు సేవలు మెసేజింగ్ టూల్స్ ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. షాపింగ్ టూల్ ఈ సంవత్సరమే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 2021 సంవత్సరం నుంచి మెసేజ్ హోస్టింగ్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. వాట్సాప్‌ సీఓఓ మాత్‌ ఇడేమా ఈ విషయాలను వెల్లడించారు.

Also Read: ‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..!

వాట్సాప్ త్వరలో వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో కొన్ని సర్వీసులకు నగదు వసూలు చేయనుందని తెలుస్తోంది. అయితే వేటికి ఛార్జీలను వసూలు చేయబోతుందనే సంగతి తెలియాల్సి వస్తోంది.