https://oktelugu.com/

చదువులకు బ్రేక్: ఇంటర్ క్లాసులు మళ్లీ వాయిదా

కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు తెరిచే ప్రక్రియ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పాఠశాలలు మొదలైనా కరోనా సెకండ్ వేవ్ తో తల్లిదండ్రులు పంపని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కళశాలల చదువులకు కూడా బ్రేక్ పడ్డ పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ తరగతులు మరోసారి వాయిదా పడ్డాయి. కొత్త షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఎపి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. Also Read: డీకే అరుణ, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 12:03 PM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ తో మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు తెరిచే ప్రక్రియ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పాఠశాలలు మొదలైనా కరోనా సెకండ్ వేవ్ తో తల్లిదండ్రులు పంపని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కళశాలల చదువులకు కూడా బ్రేక్ పడ్డ పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ తరగతులు మరోసారి వాయిదా పడ్డాయి. కొత్త షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఎపి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు.

    Also Read: డీకే అరుణ, పురంధేశ్వరికి అందలం.. బీజేపీ సంచలన నిర్ణయాలు

    కరోనావైరస్ ప్రభావం కారణంగా విద్యార్థుల ఆరోగ్య కారణాల దృష్ట్యా విద్యా సంస్థలను తిరిగి తెరిచే ప్రక్రియ చాలా ఇబ్బందుల్లో పడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపే పరిస్థితులు కనిపించడం లేదు.  వ్యాక్సిన్ లభించే వరకు పరిస్థితి సమస్యాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు.

    తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఏపీ ఇంటర్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వీటిని వాయిదా వేస్తున్నట్టు ఇంటర్ విద్యామండలి తెలిపింది. కోవిడ్ మార్గదర్శకాల దృష్ట్యా, ప్రభుత్వం ఒక తరగతికి 40 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించింది. కానీ, తరగతి బలాన్ని 88 కి పునరుద్ధరించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ వేశాయి.

    Also Read: వాళ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. తక్షణమే రూ.10 వేల సాయం..?

    ఆన్‌లైన్ నమోదుకు ప్రవేశాలను ప్రభుత్వం అనుమతించింది. అయితే, కళాశాల యాజమాన్యాలు ఆఫ్‌లైన్ ప్రవేశాల కోసం విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎవరికీ ముందస్తు సమాచారం లేదా మార్గదర్శకాలను ఇవ్వకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రవేశాలను ప్రారంభించిందని కళాశాల యాజమాన్యాలు కోర్టుకు పిటిషన్ వేశాయి. దీంతో కోర్టు కళాశాలల తరగతుల ప్రారంభంపై స్టే విధించాయి. దీంతో ఇంటర్ తరగతులు ఆగిపోయాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్