టీఆర్ఎస్ కష్టాలు.. కేటీఆర్‌కు సవాల్‌?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీర్‌ఎస్‌కు కష్టాలు మొదలయ్యాయా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2014 నుంచి ఏ ఎన్నిక జరిగినా తమకు తిరుగులేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్న పార్టీకి రాను రాను కష్టకాలం మొదలయ్యే అవకాశాలున్నాయా అని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో 60 సీట్లతో గెలిచిన టీఆర్‌ఎస్‌కు 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వస్తుందని, సంక్షేమ పథకాల హామీల అమలులో కేసీఆర్‌ విఫలమయ్యాడని అన్నారు. కానీ 2014 కంటే ఎక్కువ సీట్లను […]

Written By: NARESH, Updated On : November 3, 2020 10:28 am
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీర్‌ఎస్‌కు కష్టాలు మొదలయ్యాయా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2014 నుంచి ఏ ఎన్నిక జరిగినా తమకు తిరుగులేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్న పార్టీకి రాను రాను కష్టకాలం మొదలయ్యే అవకాశాలున్నాయా అని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో 60 సీట్లతో గెలిచిన టీఆర్‌ఎస్‌కు 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వస్తుందని, సంక్షేమ పథకాల హామీల అమలులో కేసీఆర్‌ విఫలమయ్యాడని అన్నారు. కానీ 2014 కంటే ఎక్కువ సీట్లను తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత కూడా మిగతా పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ ప్రతిపక్ష బెడద లేకుండా చేసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇక తమకు తిరుగులేదని భావించిన కేసీఆర్‌ తన కుమారుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నాడు. అయితే గత 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం టీఆర్‌ఎస్‌కు కాస్త కంట్లో నలుసుగా మారింది. అయితే కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత దూకుడు పెంచడంతో ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది.

ఇదే తరుణంలో దుబ్బాక ఉప ఎన్నిక జరగుతుండడంతో అధికారంలో ఉన్న తమకు అక్కడ గెలుపు ఖాయమేనని, అయితే మెజారిటీ కోసం శ్రమించాలని భావించింది. కానీ రాను రాను గెలుపు కోసం కూడా తీవ్రంగా కృషి చేయాల్సి వస్తోంది. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక జరగుతుండడంతో నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Also Read: ఓటుకు నోటు కేసు: ఎమ్మెల్యే సండ్రకు కోర్టులో గట్టి షాక్

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌కు ఈసారి అంతకంటే ఎక్కువగా సీట్లు సాధించాలని ప్రణాళిక రచించారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఏర్పడనుంది. వరద కారణంగా నష్టపోయిన వారికి రూ. 10వేల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఈ సాయం బాధితులకు చేరడంలో కొన్ని తప్పిదాలు ఎదురయ్యాయి. వరదసాయం అందలేదని కొందరు ధర్నాలకు దిగగా.. మరి కొందరు తమకు సగం మొత్తాన్నే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ స్థానిక కార్పొరేటర్లు వరద సమయంలో ఎటువంటి సాయం చేయలేదని పరామర్శించేందుకు వెళ్లిన వారిపై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి.

Also Read: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.! హెచ్చరించిన బీజేపీ

ఇలాంటి పరిణామాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు సవాల్‌గా మారాయి. ఇప్పటి తమకు ఎదురులేదని భావించిన టీఆర్‌ఎస్‌కు ఇలా వరదలు, ఇతర కారణాల వల్ల పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి.