క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలే.. భారత్-పాక్ క్రికెట్ సిరీస్!

శత్రుదేశాలైన భారత్-పాకిస్తాన్ మధ్య వరుస వివాదాలు ఘర్షణలతో క్రికెట్ కు చోటు లేకుండా పోయింది. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తుంది. అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ కోసం పాక్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు జరిగేలా ప్రయత్నాలు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు […]

Written By: NARESH, Updated On : March 26, 2021 10:12 am
Follow us on

శత్రుదేశాలైన భారత్-పాకిస్తాన్ మధ్య వరుస వివాదాలు ఘర్షణలతో క్రికెట్ కు చోటు లేకుండా పోయింది. రెండు దేశాల మధ్య క్రికెట్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తుంది. అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ కోసం పాక్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు జరిగేలా ప్రయత్నాలు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.

రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కాల్పులు, తీవ్రవాద చర్యలతో క్రికెట్ సిరీస్ లు జరగడం లేదు. దేశాల మధ్య పర్యటనలు ఆగిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లలో మాత్రమే రెండు జట్లు తలపడుతున్నాయి.

ఈ క్రమంలోనే పీసీబీ రెండు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.2023లో పాకిస్తాన్ లో నిర్వహించే ఆసియా కప్ లో భారత్ ఆడుతుందనే ఆశిస్తున్నట్టు పీసీబీ చైర్మన్ మణి తెలిపారు. 2012-13 భారత్ పాకిస్తాన్ జట్లు చివరి సారిగా సిరీసుల్లో తలపడ్డాయి. 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొన్నాయి.