గత కొన్ని రోజుల నుంచి బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధరలో మార్పులు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఇతర అంశాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతుండగా నాలుగో రోజు కూడా బంగార ధర ఏకంగా మూడు వందల రూపాయలు తగ్గడం గమనార్హం.
కొన్ని రోజుల క్రితం వరకు రేట్లు పెరగడం వల్ల బంగారం కొనుగోలు చేయలేని వారికి బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పాలి. వెండి కూడా బంగారం దారిలోనే పయనించడం గమనార్హం. నిన్నటివరకు బంగారం ధర తగ్గినా వెండి ధర మాత్రం పెరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు మాత్రం వెండి ధర రికార్డు స్థాయిలో ఏకంగా 1600 రూపాయలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్ లో 24 300 రూపాయలు తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర 51,340 రూపాయలకు చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు తగ్గి 47,000 రూపాయలకు చేరింది. బంగారం ధరలు తగ్గడంతో పసిడి కొనుగోళ్లు పుంజుకుంటాయని వ్యాపారులు భావిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ గురించి వెలువడిన ప్రకటన సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. పరిశ్రమ యూనిట్లు, వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధర తగ్గడానికి కారణమని అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో సైతం బంగారం ధర ఔన్స్ కు 0.02 శాతం తగ్గి 1864 డాలర్లకు క్షీణించడం గమనార్హం. దేశీయంగా వెండి ధర తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం వెండి ధర పెరగడం గమనార్హం.