ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ.. లేదంటే టీడీపీ పాలన ఉండేది. ఈ టీఆర్ఎస్ తెలంగాణ వరకు కేవలం ప్రాంతీయ పార్టీగా ఉండేది. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లలో పోటీచేసింది. అంతకుముందు 2004లో కాంగ్రెస్ తో పొత్తుతో కొన్ని సీట్లలో గెలిచింది. అసలు బీజేపీ ఉనికే ఉండేది కాదు. టీడీపీతో పొత్తుతో కొన్ని ఎంపీ సీట్లను గెలిచేది.
Also Read: ఉత్కంఠను రేపిన తొలి ఫలితం.. విజేత ఎవరంటే?
కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ విడిపోవడంతో ఈ రెండు పార్టీల కథ మారింది. వాటి తలరాతలు మారిపోయాయి. కాంగ్రెస్ ఏపీలో ఖతమైంది. తెలంగాణలోనూ తాజా ఫలితాలతో అదే దిశగా సాగుతోంది. ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాగా.. ఏపీలో పోరాడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఒకటి రెండు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుండగా.. టీడీపీ ఉనికే లేకుండా పోయింది. ఈ పరిస్థితి చూసి రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు అయ్యో పాపం అంటూ నిట్టూరుస్తున్నారు.
దుబ్బాక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు, మూడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తూ ఉండడం ఒక జాతీయ పార్టీకి రావలసిన ఫలితం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read: జీహెచ్ఎంసీ కౌంటింగ్: ఎస్ఈసీ vs హైకోర్టు.. ఏం జరుగనుంది?
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ ను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. అటు జనాలు వదిలేసి.. ఇటు మీడియా కూడా లైట్ తీసుకుంది. కారణం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. ఇక ఒకప్పుడు తెలంగాణ లో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ అసలు ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.
దుబ్బాకలో ఓడి.. జీహెచ్ఎంసీలోనూ అదే ట్రెండ్ ను కాంగ్రెస్ కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఖతమైనా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్