జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్: ఏ పార్టీ గెలుస్తుందంటే?

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సంపూర్ణంగా ముగియడంతో వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఏపార్టీ వైపు జనం ఉన్నారన్నది చూచాయగా తెలియవచ్చింది. Also Read: రేవంత్ రెడ్డికే టీపీసీసీ.. ముహుర్తం ఖరారైందా? ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో సర్వేసంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఓల్డ్ మలక్ పేట్ లో రీపోలింగ్ ముగియగానే ఇవి వెల్లువెత్తాయి. ఈరోజు వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండడంతో […]

Written By: NARESH, Updated On : December 3, 2020 8:27 pm
Follow us on

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సంపూర్ణంగా ముగియడంతో వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఏపార్టీ వైపు జనం ఉన్నారన్నది చూచాయగా తెలియవచ్చింది.

Also Read: రేవంత్ రెడ్డికే టీపీసీసీ.. ముహుర్తం ఖరారైందా?

ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో సర్వేసంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఓల్డ్ మలక్ పేట్ లో రీపోలింగ్ ముగియగానే ఇవి వెల్లువెత్తాయి. ఈరోజు వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండడంతో జనం నాడి తెలియరాలేదు.

డిసెంబ‌ర్ 1న జ‌రిగిన ఎన్నిక‌ల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది ఓటేశారు. 46.55 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్ జరిగింది.

అన్ని ఎగ్జిట్ పోల్స్ చూశాక.. గ్రేట‌ర్ పీఠాన్ని నగరవాసులు గులాబీ పార్టీకే క‌ట్టబెడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

Also Read: కేసీఆర్ ఇచ్చాడు.. నువ్వు ఎందుకు ఇవ్వవు జగన్: పవన్

* పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్రకారం.. టీఆర్ఎస్ 68 -78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 1-5 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 28శాతం, నిరుద్యోగం 21 శాతం, వరద సాయం 16 శాతం, రోడ్లు 10 శాతం, పారిశుద్ధ్యం 9 శాతం, ఇతర సమస్యలు 4 శాతం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది.

* థ‌ర్డ్ విజ‌న్ అనే సంస్థ స‌ర్వే ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీకి 95-101 డివిజ‌న్లలో గెలిచే అవ‌కాశం ఉంది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవ‌కాశం ఉంది.

* సీపీఎస్ స‌ర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కు 82 -96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు గెలుపొందే అవ‌కాశం ఉంది.

* ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. టీఆర్ఎస్‌కు 78(+/-7), బీజేపీ 28(+/-5), మ‌జ్లిస్ పార్టీ 41(+/-5), కాంగ్రెస్ 3(+/-3) స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్