అక్టోబర్ 2న గాంధీ జయంతి. 2007నుంచి ప్రతీయేటా గాంధీ జయంతి ప్రపంచ అహింసా దినోత్సవం(International Day of Non-Violence)గా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. గాంధీ మహాత్ముడిని భారతీయులంతా ‘జాతిపిత’గా సంబోధిస్తుంటారు. అహింసతో ఆంగ్లేయులను భారతదేశం నుంచి తరిమిన ఘనత గాంధీకే దక్కుతుంది.
Also Read: ‘భారత్’కు చేరుకున్న మోదీ వీవీఐపీ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..?
గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్‌లో గాంధీ జన్మించాడు. గాంధీ బారిష్టర్ చదివారు. ఆ సమయంలోనే ఆంగ్లేయుల నుంచి జాతివివక్షను ఎదుర్కొన్నారు. గాంధీ న్యాయశాస్త్రం అభ్యసించిన అనంతరం భారత్ కు వచ్చిన గాంధీ భారతీయులపై ఆంగ్లేయులు చేస్తున్న దమనకాండను వ్యతిరేకించారు. గాంధీ తొలినాళ్లలో ఆంగ్లేయులపై దూకుడుగా వెళ్లినా.. ఆ తర్వాత కాలంలో అహింసే ప్రధాన ఆయుధంగా వారిపై పోరాటం చేశారు.
గాంధీ భారతదేశానికి రాకముందు నుంచే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగేవి. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఈ సమయంలోనే గాంధీ ఎంట్రీ ఇవ్వడంతో స్వాతంత్ర్య ఉద్యమ స్వరూపమే మరిపోయింది. గాంధీ అహింసను నమ్మారు. అందుకు తగ్గట్టుగానే చివరికీ వరకు శాంతియుతంగానే బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. చివరికీ అనుకున్నది సాధించారు.
మహాత్మా గాంధీ కొల్లాయి గట్టి.. చేత కర్రబట్టి.. నూలు వడకి.. మురికివాడలు శుభ్రం చేసి.. అన్ని మతాలూ, కులాలు ఒకటే అని చాటిచెప్పారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సహాయ నిరాకరణ.. సత్యాగ్రహము అనే ఆయుధాలతో గడగడలాడించారు. గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని ప్రజలకు ఆయన బోధించేవారు. ఆయన ఎల్లప్పుడు సత్యమార్గాన్నే అనుసరించారు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్ర్యం రాగా 1948 జనవరి 30న గాంధీ హత్యకు గురయ్యారు.
Also Read: రాజధాని నడిబొడ్డున బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
భారతదేశానికి గాంధీ ఏ ఆశయాలతోనైనా స్వాతంత్ర్యం తీసుకొచ్చారో అది మాత్రం నేటికీ నెరవేరలేదు. ఆడది అర్ధరాత్రి తిరిగినపుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ చెప్పారు. అయితే నేడు అర్ధరాత్రి కాదు కాదా.. పగలు కూడా తిరగలేని పరిస్థితులు దాపురించాయి. చట్టాలు కొందరికీ చుట్టాలుగా మారుతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.