వరదసాయం పాతవారికేనా? కొత్త దరఖాస్తులపై క్లారిటీ ఏది?

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా డిసెంబర్ 7నుంచి వరదసాయం బాధితులందరికీ అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. దీంతో 7తేది ఉదయం నుంచే వరద సాయం కోసం బాధితులంతా మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధితులు ఎవరు కూడా మీసేవా సెంటర్లకు రావద్దని సూచించారు. బాధితుల అకౌంట్లను ఆధార్ తో లింకు చేసి నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. Also Read: హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా? […]

Written By: Neelambaram, Updated On : December 10, 2020 1:51 pm
Follow us on


జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా డిసెంబర్ 7నుంచి వరదసాయం బాధితులందరికీ అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. దీంతో 7తేది ఉదయం నుంచే వరద సాయం కోసం బాధితులంతా మీసేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధితులు ఎవరు కూడా మీసేవా సెంటర్లకు రావద్దని సూచించారు. బాధితుల అకౌంట్లను ఆధార్ తో లింకు చేసి నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

Also Read: హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా?

వరద బాధితుల ఇళ్లకే అధికారుల బృందం వచ్చి క్షేత్రస్థాయిలో రిపోర్టు సేకరించి సాయం చేస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. దీంతో కొందరు బాధితులు అదేరోజు సీఎం క్యాంపస్ ఆఫీస్ ముట్టడి.. కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. వరదసాయం నిజమైన అర్హులకు కాకుండా సెకండ్ ప్లోర్లలో నివసించే వారికి సైతం ఇచ్చి నిజమైన బాధితులకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే వరదసాయం కోసం ఇప్పటికే రెండు లక్షల ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి బాధితులకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 17,333మందికి బ్యాంకు ద్వారా 17.33కోట్ల సాయాన్ని అందించినట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది.

అయితే అధికారులు క్షేత్ర పర్యటన చేపట్టి కొత్త ఏ ఒక్క లబ్ధిదారుడిని గుర్తించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకున్న వారికే జీహెఎంసీ వరదసాయం అందిస్తుందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఏ ఒక్క లబ్దిదారుడిని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించలేదని వాపోతున్నారు. మీసేవాలో బాధితులు దరఖాస్తు చేసుకున్న తొలినాళ్లలో రోజుకు 55కోట్లు పంపిణీ చేసిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం రోజుకు 9కోట్లు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు..!

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఒక్క లబ్దిదారుడిని కూడా జీహెచ్ఎంసీ గుర్తించకపోవడంతో విమర్శలు తావునిస్తోంది. కొత్త దరఖాస్తులు తీసుకోకపోవడంతో బాధితుల నుంచి నేతలపూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతో జీహెచ్ఎంసీ ఉన్నాధికారులు ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ప్రకటనలు చేస్తూ బాధితులను అమోమయానికి గురిచేస్తున్నారు.

సీఎం కేసీఆర్ అర్హులైన ప్రతీఒక్కరికి వరదసాయం అందిస్తామని ప్రకటించగా జీహెచ్ఎంసీ మాత్రం కొత్తగా దరఖాస్తులు తీసుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. అయితే గతంలోనే 2లక్షల ధరఖాస్తులు పెండింగ్ లో ఉండటంతో వీటిని క్లియర్ చేసే పనిలో జీహెచ్ఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. దీంతోనే కొత్త దరఖాస్తులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏదిఏమైనా వరద సాయం టీఆర్ఎస్ సర్కారును బురదలోకి లాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్