https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్: ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. Also Read: ‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రతో సందడి చేయనుంది. ఇప్పటికే రాధేశ్యామ్ లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 02:21 PM IST
    Follow us on

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.

    Also Read: ‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత

    పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రతో సందడి చేయనుంది.

    ఇప్పటికే రాధేశ్యామ్ లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. ఇవి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీజర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వేళ ‘లవర్స్ డే’ ఫిబ్రవరి 14 సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

    Also Read: పెళ్లి తరువాత సింగర్ సునీత.. ఎలా ఉందో తెలుసా ? పిక్ వైరల్

    విక్రమాదిత్య, ప్రేరణలకు సంబంధించిన గ్లింప్స్ ఫ్యాన్స్ కు తప్పక థ్రిల్ కలిగిస్తుందని తెలుస్తోంది. జస్టిన్ ప్రభాకరణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటలు ఆకట్టుకుంటున్నాయి.

    ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీ లోనే జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా టైంలోనూ జాగ్రత్తలతో అక్కడ షూటింగ్ను పూర్తి చేశారు. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్