https://oktelugu.com/

ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా.. బీజేపీకి అవమానమే?

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సాధారణంగా జాతీయ జెండా ఎగురుతుంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీపై దండెత్తిన రైతుల జెండాలు అదే ఎర్రకోటపై ఎగరడం సంచలనంగా మారింది. దేశరాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలుచోట్ల పోలీసులు, రైతులు తీవ్ర ఘర్షణ పడ్డారు. పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ రైతులు మాత్రం భద్రతా వలయాలను చేధించుకొని చివరకు ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ రైతు జెండాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2021 / 04:39 PM IST
    Follow us on

    స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సాధారణంగా జాతీయ జెండా ఎగురుతుంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీపై దండెత్తిన రైతుల జెండాలు అదే ఎర్రకోటపై ఎగరడం సంచలనంగా మారింది.

    దేశరాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలుచోట్ల పోలీసులు, రైతులు తీవ్ర ఘర్షణ పడ్డారు. పోలీసులు ఎంత అడ్డుకున్నప్పటికీ రైతులు మాత్రం భద్రతా వలయాలను చేధించుకొని చివరకు ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ రైతు జెండాలను ప్రదర్శిస్తూ బీజేపీ తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

    రైతుల ర్యాలీకి ఈ సాయంత్రం వరకే అనుమతి ఉంది. అయితే అనుమతి లేని ప్రాంతాల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. ఆ బస్సులను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మరిన్ని బస్సులు అడ్డుగా ఉన్నా కూడా ట్రాక్టర్లతోనే పక్కకు తోసివేసి ముందుకు సాగారు. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.

    రైతులు అన్ని అడ్డంకులు దాటుకొని చివరకు ఎర్రకోటను చేరుకున్నారు.దీంతో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఓవైపు వేల సంఖ్యలో రైతుల ఆందోళన.. మరోవైపు వారిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.. ఇక అక్షరధామ్ ప్రాంతంలోనూ రైతులకు పోలీసులకు తీవ్ర ఘర్షణ జరిగింది. ఎర్రకోటపైకి రైతులు ఎక్కి రైతుల జెండాను ఎగురవేసి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఇది బీజేపీకి అవమానేనని.. ఆ పార్టీపై రైతులు చేస్తున్న యుద్ధం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.