
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీలుగా ఉన్న 189 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.esic.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్, ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 189 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 11 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 25, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 11, సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 7, జూనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 17, స్పెషాలిటీ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 5, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఎనిమిది, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు 96, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలు 1, జూనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటంతో ఆసక్తి ఉన్నవాళ్లు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మార్చి 18వ తేదీన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా మార్చి 25 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 వరకు ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు మహిళలు, పీహెచ్ అభ్యర్థులు, ఈ.ఎస్.ఐ.సీ ఉద్యోగులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.