మున్సిపల్ ప్రచారానికి నేటితో తెర: గుంటూరులో త్రిముఖ పోరు.. నేతల సందడి

ఏపీలో మూడు వారాలుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు తెరపడనుంది. చివరిరోజు కావడంతో పార్టీలు, అభ్యర్థులు, వ్యూహాల ప్రాధాన్యాలు మారిపోయాయి. అధికార వైసీపీతోపాటు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే నెలకొంది. విజయవాడ, గుంటూరు, విశాఖతోపాటు పలు చోట్ల టీడీపీ కమ్యూనిస్టుల పొత్తుతో బరిలోకి దిగింది. జనసేన ఎక్కడికక్కడ బీజేపీతో అవగాహనతో ముందుకెళుతోంది. జనసేన గెలుపు […]

Written By: NARESH, Updated On : March 8, 2021 1:07 pm
Follow us on

ఏపీలో మూడు వారాలుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు తెరపడనుంది. చివరిరోజు కావడంతో పార్టీలు, అభ్యర్థులు, వ్యూహాల ప్రాధాన్యాలు మారిపోయాయి. అధికార వైసీపీతోపాటు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే నెలకొంది.

విజయవాడ, గుంటూరు, విశాఖతోపాటు పలు చోట్ల టీడీపీ కమ్యూనిస్టుల పొత్తుతో బరిలోకి దిగింది. జనసేన ఎక్కడికక్కడ బీజేపీతో అవగాహనతో ముందుకెళుతోంది. జనసేన గెలుపు అవకాశాలు ఉండడంతో విజయవాడ వంటి చోట్ల బీజేపీ తన అభ్యర్థులను కూడా ఉపసంహరించుకుంది. పొత్తులు, అవగాహనలతో జనసేన మున్సిపల్ ఫలితాలను ప్రభావితం చేసేలా దూసుకెళుతోంది.

గుంటూరు, విజయవాడల్లో వైసీపీ, టీడీపీకి నష్టం జరిగేలా పరిణామాలున్నాయి. మూడు రాజధానుల ప్రస్తావనకు వైసీపీ, టీడీపీ తేవడం లేదు. రాజధానులను ప్రస్తావిస్తే జరిగే మేలుకంటే నష్టమే ఎక్కువన్న ఉద్దేశంతో అధికార ప్రతిపక్షాలు గప్ చుప్ గా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో సైలెంట్ అయ్యాయి. వీరిద్దరి తీరు చూశాక బీజేపీ, జనసేన దూకుడుగా ముందుకెళుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి షాకిస్తూ జనసేన సత్తా చాటింది. అదే జోష్ తో మున్సిపల్ ఎన్నికల్లో ముందుకెళుతోంది. బీజేపీకి అవకాశాలు బాగా తగ్గడంతో ఆ పార్టీ జనసేనకు సపోర్టుగా నిలుస్తోంది. దీంతో జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్మాయంగా దూసుకొచ్చింది. ఏపీలో వైసీపీ, టీడీపీ మాత్రమే ద్విముఖ పోరు అనుకుంటున్న దశలో మూడో ప్రత్యామ్మాయంగా జనసేన ఎంట్రీ రాజకీయాలను మార్చేసింది. దీంతో కీలకమైన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఉత్కంఠగా మారింది.

కాగా గుంటూరులో చివరిరోజు పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. చివరిరోజు బీజేపీ కీలకనేత కన్నా లక్ష్మీనారాయణ, జనసేన తరుఫున పాకనాటి రమాదేవి , కేకే తదితరులు జోరుగా ప్రచారం చేశారు.

ఇక టీడీపీలో చంద్రబాబు రాకతో జోష్ పెరిగింది. వైసీపీ తరుఫున కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డిలు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ త్రిముఖ పోరులో జనసేనకు లాభం కలుగుతుందని స్థానికంగా టాక్ నడుస్తోంది.